Vandemataram On Phone Calls: హలో వద్దు.. వందేమాతరం అనండి: ఉద్యోగులకు అటవీశాఖ ఆదేశాలు

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేళ ఫోన్‌ కాల్స్‌ రిసీవ్‌ చేసుకునేటప్పుడు హలో బదులుగా వందేమాతరం అని చెప్పాలని తమ శాఖ అధికారులను కోరినట్లు అటవీ శాఖ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సుధీర్‌ ముంగంటివార్‌ అంతకుముందు మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే.

Vandemataram On Phone Calls: ఫోన్ కాల్ ఎత్తగానే ఎవరైనా హలో అంటుంటారు. బహుశా భాషా, ప్రాంతంతో సంబంధం లేకుండా ఎక్కువ మంది ఉపయోగించే పదం ఇదే కావచ్చు. అలాంటిది ఇక నుంచి ఎవరికైనా ఫోన్లో మాట్లాడే ముందు హలో కాకుండా ‘వందేమాతరం’ అనాలంటూ కొత్త నిబంధన పెట్టారు. మహారాష్ట్రలోని అటవీ అధికారులకు ఆ శాఖ తాజాగా జారీ చేసిన ఆదేశం ఇది. అయితే ఇది రోజు మొత్తం కాకుండా కేవలం డ్యూటీలో ఉన్న సమయంలోనే తప్పనిసరిగా పాటించాలని మిగతా సమయాల్లో ఐచ్ఛికమని పేర్కొన్నారు.

‘అటవీ శాఖలోని అధికారులు, సిబ్బంది అందరూ విధుల్లో ఉన్న సమయంలో పౌరులు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ను తీసుకునేటప్పుడు హలోకు బదులుగా వందేమాతరం అని అని చెప్పాలని కోరుతున్నాం’ అని అటవీ శాఖ జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేళ ఫోన్‌ కాల్స్‌ రిసీవ్‌ చేసుకునేటప్పుడు హలో బదులుగా వందేమాతరం అని చెప్పాలని తమ శాఖ అధికారులను కోరినట్లు అటవీ శాఖ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సుధీర్‌ ముంగంటివార్‌ అంతకుముందు మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే.

Hit By Truck: కుక్కను తప్పించబోయి ప్రాణాలు కోల్పోయిన యువకుడు

ట్రెండింగ్ వార్తలు