Hit By Truck: కుక్కను తప్పించబోయి ప్రాణాలు కోల్పోయిన యువకుడు

పుస్తా రోడ్ సమీపంలో ఒక బైక్ ప్రమాదానికి గురైందని రాత్రి 11:29గంటలకు పోలీసులకు ఫోన్ వచ్చింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని స్థానికులను ప్రశ్నించగా ఒక వీధి కుక్కను తప్పించబోతుంటే బైక్ స్లిప్ అయి ట్రక్ కింద పడిందని, ఆ క్రమంలో ప్రయాణిస్తున్న ఒక వ్యాన్ కింద రాహుల్ పడ్డాడని తెలిపారు. తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే రాహుల్ చనిపోయాడని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.

Hit By Truck: కుక్కను తప్పించబోయి ప్రాణాలు కోల్పోయిన యువకుడు

man hit by a pickup van while avoiding dog

Updated On : August 26, 2022 / 6:45 PM IST

Hit By Truck: తన బండికి అడ్డొచ్చిన కుక్కను తప్పించబోయిన ఒక వ్యక్తి.. ట్రక్కు కింద పడి చనిపోయాడు. కుక్కను తప్పించే క్రమంలో అతడి బైక్ స్లిప్ అయిందని, ఆ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తమ రికార్డుల్లో పేర్కొన్నారు. చనిపోయిన వ్యక్తి పేరు రాముల్ అని, అతడు బిహారిపూర్ నివాసని తెలిపారు.

పుస్తా రోడ్ సమీపంలో ఒక బైక్ ప్రమాదానికి గురైందని రాత్రి 11:29గంటలకు పోలీసులకు ఫోన్ వచ్చింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని స్థానికులను ప్రశ్నించగా ఒక వీధి కుక్కను తప్పించబోతుంటే బైక్ స్లిప్ అయి ట్రక్ కింద పడిందని, ఆ క్రమంలో ప్రయాణిస్తున్న ఒక వ్యాన్ కింద రాహుల్ పడ్డాడని తెలిపారు. తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే రాహుల్ చనిపోయాడని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.

క్రైం బృందం ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉండే సీసీటీవీ కెమెరాలను పరిశీస్తోందని, ఇప్పటికైతే తమకు అందిన సాక్ష్యాల ఆధారంగా కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నామని స్థానిక డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు సాగర్ సింగ్ కల్సి పేర్కొన్నారు.

Noida Twin Towers: నోయడా ట్విన్ టవర్స్ కూల్చివేతకు సర్వం సిద్ధం.. ట్రాఫిక్ దారి మళ్లింపు