Sbi
SBI App, Net Banking : ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు ప్రముఖ స్థానం ఉంది. ఈ బ్యాంకు ఖాతాదారులకు కీలక ప్రకటన చేసింది. 14 గంటల పాటు ఇంటర్ నెట్ బ్యాంకింగ్, యోనో, యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడనుందని వెల్లడించింది. వివిధ కారణాల వల్ల అంతరాయం కలుగుతుందని తెలిపింది. 2021, మే 22వ తేదీ శనివారం బ్యాంకింగ్ లావాదేవీలు ముగిసిన అనంతరం ఆర్బీఐ సాంకేతికంగా అప్ గ్రేడ్ చేయడం వల్ల డిజిటల్ సేవల్లో అంతరాయం కలుగుతుందని వెల్లడించింది.
2021, మే 23వ తేదీ ఆదివారం 00.01 (AM) నుంచి 14.00 (PM) గంటల మధ్య ఇంటర్ నెట్ బ్యాంకింగ్, యోనో, YONO Lite లను ఉపయోగించలేరని తెలిపింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్ పై నెఫ్ట్ (NEFT) సేవలు 00:01 (AM), 14:00 (PM) అందుబాటులో ఉండవని తెలిపింది. 2021, మే 23 మే ఆదివారం RTGS సేవలు ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
మెరుగైన బ్యాంకింగ్ సేవలను కస్టమర్లకు అందచేయాలనే ప్రయత్నం చేస్తున్నామని, కస్టమర్లు సహకరించాలని కోరింది. మే 07, మే 08వ తేదీల్లో కూడా నిర్వాహణ కారణంగా..ఎస్‌బీఐ ఆన్ లైన్ సేవలకు అంతరాయం కలిగింది. దేశ వ్యాప్తంగా 22 వేల శాఖలున్నాయి. 57 వేల 889కి పైగా ఈ బ్యాంకు ఏటీఎంలున్నాయి. డిసెంబర్ 31వ తేదీ నాటికి 85 మిలియన్ల ఇంటర్ నెట్ బ్యాంకింగ్, 19 మిలియన్ మొబైల్ బ్యాంకింగ్ లను వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. SBI YONO లో 34.5 మిలియన్లకు పైగా నమోదిత వినియోగదారులున్నారు.
Important Notice for our customers w.r.t. NEFT technical upgradation by RBI#SBI #StateBankOfIndia #ImportantNotice #InternetBanking #OnlineSBI pic.twitter.com/p3XWoeTwxj
— State Bank of India (@TheOfficialSBI) May 21, 2021
Read More : Twitter Blue Tick : ట్విట్టర్ అకౌంట్ల వెరిఫికేషన్.. బ్లూ టిక్ మార్క్ కోసం అప్లయ్ చేసుకోండిలా..