SBI CBO Recruitment 2021 : ఎస్బీఐలో ఉద్యోగాలు.. 1226 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? ప్రభుత్వ బ్యాంకులో జాబ్ కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు..

SBI CBO Recruitment 2021 : మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? ప్రభుత్వ బ్యాంకులో జాబ్ కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ల (సీబీఓ) నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు రాష్ట్రాల్లో మొత్తం 1226 పోస్టుల భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. గురువారం (డిసెంబర్ 9,2021) నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ భర్తీ విధానం మొత్తం మూడు దశల్లో ఉంటుంది.

iPhone 13 Mini: ఐఫోన్‌పై నెవర్ బిఫోర్ ఆఫర్.. రూ.36వేలు డిస్కౌంట్

* మొత్తం ఖాళీలు-1226
* తొలుత రాత పరీక్ష.. స్క్రీనింగ్ .. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటాయి.
* మెరిట్ ఆధారంగా అభ్యర్దుల ఎంపిక.
* దరఖాస్తు చివరి తేదీ – డిసెంబర్ 9 – డిసెంబర్ 29
* విద్యార్హత.. డిగ్రీ పాస్ కావాలి.
* 2022 జనవరిలో ఆన్ లైన్ పరీక్ష.
* వయసు.. 01.12.2021 నాటికి… 21ఏళ్లకు తగ్గకూడదు, 30ఏళ్లు మించకూడదు.
* బేసిక్ శాలరీ..రూ.36వేలు+(సర్వీస్ లో ఒక్కో ఏడాదికి ఒక ఇంక్రిమెంట్).
* డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ, మెడికల్, ఇతర అలవెన్స్ లకు అర్హులు.
* వెబ్ సైట్.. sbi.co.in

Amazon Prime: డిసెంబర్ 13వ తేదీలోపు అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే బెనిఫిట్ ఇదే!

పూర్తి వివరాలకు ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ (sbi.co.in) కి వెళ్లాలి. రాత పరీక్ష ఆన్ లైన్ లో నిర్వహిస్తారు. ఆ తర్వాత స్క్రీనింగ్ కోసం ఎంపికైన వారి జాబితాను వెబ్ సైట్ లో పెడతారు. చివరగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్దులను ఎంపిక చేస్తారు.

ట్రెండింగ్ వార్తలు