Sbi Acct
SBI Offer: దేశీయంగా అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పలు రకాల సేవలు అందిస్తోంది. బ్యాంక్ ఖాతా ఓపెనింగ్ సర్వీస్ ద్వారా ప్రతి ఒక్క సామాన్యుడికి అకౌంట్ ఉండే అవకాశం కల్పించింది. స్టేట్ బ్యాంక్‌లో జన్‌ధన్‌ఖాతా ఓపెన్ చేస్తే.. పలు రకాల బెనిఫిట్స్ ఉన్నాయి.
సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తోన్న జన్ ధన్ యోజన స్కీమ్ ద్వారా మోదీ సర్కార్ పేదలకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. జీరో బ్యాలెన్స్ అకౌంట్ గా పేరున్న ఈ అకౌంట్లో ఎటువంటి మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన పనిలేదు.
ఈ ఖాతా ద్వారా కస్టమర్లకు ఉచితంగా రూ.2 లక్షల బెనిఫిట్ వస్తుంది. రూపే డెబిట్ కార్డు పొందిన వారికి మాత్రమే ఈ బెనిఫిట్ ఉంటుంది. ఇవన్నీ ఇన్సూరెన్స్ రూపంలోనే అందుతాయి. ప్రమాదబీమా కింద రూ.2 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఉంది.
జన్‌ధన్ అకౌంట్ తెరిచే వారికి దీంతో పాటు మరిన్ని పలు రకాల బెనిఫిట్స్ లభిస్తాయి. రూ.10 వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. బ్యాంక్ నిర్ణయం మీదనే ఈ సేవలు వాడుకోగలం. సాధారణ సేవింగ్స్ ఖాతాకు వర్తించే వడ్డీ రేటే జన్ ధన్ ఖాతాలకు వర్తిస్తుంది.