చెక్ చెల్లింపులు SBI కొత్త రూల్, పాజిటివ్ పే సిస్టమ్ అంటే ఏమిటీ ?

SBI to implement new cheque payment system : నూతన సంవత్సరం రావడానికి కొద్ది గంటలే మాత్రమే ఉంది. రానున్న 2021 సంవత్సరంలో కొత్త కొత్త రూల్స్ రాబోతున్నాయి. పలు బ్యాంకులు కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొత్త రూల్ ను జనవరి 01 నుంచి తీసుకొస్తోంది. పేమెంట్స్ కోసం ఎక్కువగా చెక్ వాడుతున్నట్లయితే..తప్పనిసరిగా వీటిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చెక్ పెమెంట్స్ విషయంలో…పాజిటివ్ పే సిస్టమ్ Positive Pay System (PPS) ప్రవేశపెట్టాలని ఆర్బీఐ (RBI) ఆదేశించిన సంగతి తెలిసిందే.

దీంతో పలు బ్యాంకులు ఆ మేరకు మార్పులు చేస్తున్నాయి. 2021 జనవరి 01 నుంచి చెక్ పేమెంట్స్ కి పాజిటివ్ పే అమలు చేస్తున్నట్లు, రూ. 50, 000 పైన చెక్ పేమెంట్స్ కు ఈ రూల్ వర్తిస్తుందని వెల్లడించింది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే…సమీపంలోని SBI బ్రాంచ్ ని సంప్రదించాలని బ్యాంకు సూచించింది. వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని, చెక్ చెల్లింపుకు సంబంధించి మోసం, దుర్వినియోగ కేసులను తగ్గించేందుకు ఆగస్టులో RBI గవర్నర్ శక్తికాంత దాస్ ఈ ప్రకటన చేశారు.

పాజిటివ్ పే సిస్టమ్ (PPS) అంటే ఏమిటీ ?

పాజిటివ్ పే వ్యవస్థ అనేది ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే…చెక్కులోని వివరాలను ధృవీకరించడమే. ఎక్కువ అమౌంట్ తో కూడిన చెక్కులనుల జారీ చేసిన సమయంలో…చెక్కులో వెల్లడించిన తేదీ, లబ్దిదారుడి పేరు, చెక్ జారీ చేసిన వారి పేరు, అమౌంట్ తదితర వివరాలు పాజిటివ్ పే వ్యవస్థ ద్వారా పున:నిర్ధారణ చేస్తారు. చెక్ జారీ చేసే వారు..SMS, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎటిఎం మొదలైన ఛానెళ్ల ద్వారా ఎలక్ట్రానిక్ గా చెక్ లోని కనీస వివరాలను బ్యాంకులకు తెలియచేయాల్సి ఉంటుంది. సీటీఎస్ సమర్పించిన చెక్కుతో క్రాస్ చెక్ చేస్తారు. ఎదైనా తేడా ఉంటే..ఆ చెక్ లను బ్యాంకు నిలిపివేస్తుంది.