SC gets two new judges as Centre clears their appointment, apex court now has full strength
Supreme Court: శివసేన పార్టీ, ఎన్నికల గుర్తుపై ఇటీవల ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శివసేన పార్టీ, గుర్తును షిండే వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఈసీ నోటిఫికేషన్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. అయితే, వారం రోజుల్లో సమాధానం చెప్పాలని షిండే వర్గానికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే, మరో వారం రోజుల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని ఆదేశించింది.
తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. శివసేన ఎన్నికల గుర్తు, జెండా రెండింటినీ సీఎం ఎక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ ఫిబ్రవరి 17న ఎన్నికల సంఘం తుది ఆదేశాలు ఇచ్చింది. దీనిపైనే ఉద్ధవ్ ఠాక్రే వర్గం అభ్యంతరాలు తెలుపుతోంది. ఉద్ధవ్ ఠాక్రేతో విభేదాలతో షిండే తమ వర్గ ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు తమకే చెందుతుందని చెబుతున్నారు.
TSRTC: ఒడిశా-తెలంగాణ ఆర్టీసీల మధ్య కుదిరిన ఒప్పందం.. ఇరు రాష్ట్రాల మధ్య 23 బస్సులు