ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మరోసారి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.తనను తాను అవినీతిరహితుడిగా చెప్పుకుంటున్న మోడీ తనతో బహిరంగ చర్చకు సిద్దమా అని మంగళవారం(ఏప్రిల్-9,2019) రాహుల్ ప్రశ్నించారు.ప్రధానిజీ.. అవినీతిపై నాతో చర్చకు భయపడుతున్నారా? మీ కోసం చర్చను మరింత సులభతరం చేస్తున్నాను. దీంతో మీరు సన్నద్ధమవడానికి వీలుగా ఉంటుంది అని రాహుల్ అన్నారు.మూడు అంశాలపై మోడీ తనతో చర్చకు రావాలని అన్నారు.1.రఫేల్+అనిల్ అంబానీ, 2.నీరవ్ మోడీ, 3.అమిత్ షా+నోట్ల రద్దు అంశాలపై చర్చకు రాహుల్ ట్వీట్ చేశారు.
గతంలో కూడా మోడీకి రాహుల్ బహిరంగ సవాల్ విషయం తెలిసిందే. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా దేశ భద్రత, అవినీతి, విదేశాంగ విధానంపై చర్చకు రావాలని రాహుల్.. ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. దీనిపై ఎటువంటి స్పందన రాకపోవడంతో తనతో చర్చకు భయపడుతున్నారా అంటూ ‘స్కేర్డ్ టు డిబేట్’ హ్యాష్‌ట్యాగ్‌తో ఈరోజు మరోసారి ట్వీట్ చేశారు