ఎంత గొప్ప మనస్సు తల్లీ : గాజులు అమ్మి.. అమర జవాన్లకు విరాళం 

పుల్వామా ఉగ్రదాడి ఘటన.. ఒక జవాన్ల కుటుంబాలనే కాదు.. దేశ ప్రజలను సైతం కలిచివేసింది. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది CRPFజవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.

  • Publish Date - February 22, 2019 / 08:42 AM IST

పుల్వామా ఉగ్రదాడి ఘటన.. ఒక జవాన్ల కుటుంబాలనే కాదు.. దేశ ప్రజలను సైతం కలిచివేసింది. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది CRPFజవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.

పుల్వామా ఉగ్రదాడి ఘటన.. ఒక జవాన్ల కుటుంబాలనే కాదు.. దేశ ప్రజలను సైతం కలిచివేసింది. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది CRPFజవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఉగ్రదాడికి సంబంధించిన దృశ్యాలను టీవీల్లో వీక్షించిన ప్రతిఒక్కరి హృదయం చలించిపోయింది. అమరులైన జవాన్ల కుటుంబాల ఆవేదన అందరిని కదిలించింది. అమర CRPF జవాన్ల కుటుంబాలకు విరాళాలు ఇచ్చేందుకు ఒక్కొక్కరుగా ముందు కొస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ వంతు సాయంగా వీర జవాన్ల కుటుంబాలకు విరాళాలు అందించారు. 
Read Also: దేశం అంటే ఇదే : రూ.6 లక్షల బిక్షాటన డబ్బు.. అమర జవాన్లకు

ఇటీవల అజ్మీర్ కు చెందిన ఓ యాచకురాలు బిచ్చం ఎత్తి బ్యాంకులో కూడబెట్టిన రూ.6 లక్షలను తన మరణానతరం అమర జవాన్లకు విరాళంగా ఇచ్చింది. వీర జవాన్లకు విరాళం ఇచ్చిన వారి జాబితాలో ఇప్పుడు ఓ స్కూల్ ప్రిన్సిపల్ కూడా వచ్చి చేరారు. ఉత్తరప్రదేశ్ లోని బెరిల్లి ప్రాంతానికి చెందిన స్కూల్ ప్రిన్పిపల్ ఏకంగా తన బంగారు గాజులు అమ్మేసి అమర జవాన్లకు విరాళంగా ఇచ్చారు. గాజులు అమ్మగా వచ్చిన దాదాపు రూ.1.5 లక్షల రూపాయలను జవాన్ల కుటుంబాల తరపున ప్రధాని రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇచ్చి దేశం భక్తిని చాటుకున్నారు. 

ఆమే.. కిరణ్ జంగ్వాల్. ఓ ప్రైవేటు స్కూల్ కు కిరణ్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. అందరిలాగే ఉగ్రదాడి ఘటనపై ప్రిన్సిపల్ కిరణ్ కూడా ఎంతో తల్లడిల్లిపోయారు. వీరజవాన్ల భార్యలు ఏడుస్తుండటం టీవీలో చూసి చలించిపోయినట్టు ఆమె చెప్పారు. ‘టీవీల్లో అమర జవాన్ల భార్యలు ఏడుస్తుండటం చూశాను. నా మనస్సు కరిగిపోయింది. ఎంతో బాధ అనిపించింది. అప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. బంగారు గాజులు ఏంటి ప్రయోజనం అనిపించింది. వెంటనే నా బంగారు గాజులను అమ్మేశాను. అమ్మగా వచ్చిన 1.5 లక్షలను అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇచ్చేశాను. బంగారు గాజులను నా తండ్రి నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. ప్రజలందరూ ముందుకు రావాల్సిన సమయం. మనదేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఒక్కొక్కరు రూ.1 విరాళంగా ఇచ్చిన కోట్ల రూపాయలు సేకరించవచ్చు’అని కిరణ్ ట్విట్టర్ వేదికగా కోరారు. 

Read Also: విన్నర్ ఎవరంటే: కొండచిలువ, మొసలి బిగ్ ఫైట్ చూశారా?