Teacher Dance
Teachers Dance: ప్రాథమిక పాఠశాలలో పాఠాలు చెప్పాల్సిందిపోయి ఎంటర్‌టైన్మెంట్ వెతుక్కుంటున్నారు టీచర్లు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు క్లాస్ రూంలోనే డ్యాన్స్ వేయడంతో పాటు అదంతా వీడియో తీసుకున్నారు. అది కాస్తా సోషల్ మీడియాలో పోస్టు కావడంతో వారి కొలువుకే ఎసరొచ్చింది. అధికారుల దృష్టికి రావడంతో వారిని సస్పెండ్ చేస్తూ ప్రాథమిక విద్యా శాఖ అధికారి శనివారం ఆదేశాలిచ్చారు.
కాకపోతే వారు డ్యాన్స్ వేస్తున్న సమయంలో క్లాస్ రూంలో విద్యార్థులు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం. క్లాసులు ఎగ్గొట్టి డ్యాన్స్ వేశారా.. డ్యాన్స్ వేసేందుకు విద్యార్థులను బయటకు పంపేశారా అని ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు.
‘అచ్నెరా బ్లాక్ లోని ప్రాథమిక పాఠశాలకు చెందిన ఐదుగురు అసిస్టెంట్ టీచర్లను, హెడ్ టీచర్‌ను వివరణ ఇవ్వాలని అడిగారు. నలుగురు టీచర్లు సమాధానమివ్వగా మరొకరు రెస్పాండ్ కాలేదు’ అని బేసిక్ శిక్షా అధికారి ఇన్ ఛార్జ్ బ్రజ్ రాజ్ సింగ్ అన్నారు.
………………………… : చీమలతో ఐస్‌క్రీమ్,చెదపురుగుల పచ్చళ్లు..బొద్దింకల ఫ్రై..తింటే ఎన్నో లాభాలు !!
మార్చి 17న వీడియో రికార్డు అయినట్లుగా ఉంది. ఆ రోజు హెడ్ టీచర్ చంద్ర పరిహార్.. తాను గైర్హాజరీలో ఉన్నానని చెప్పాడు. బ్లాక్ రిసోర్స్ సెంటర్ లో ఎడ్యుకేషనల్ వర్క్ షాప్ కు వెళ్లానని వివరణ ఇచ్చుకున్నాడు. మిగతా నలుగురు టీచర్లు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో సస్పెండ్ చేశామని అధికారులు చెప్పారు. స్కూల్ టైంలో అలా చేయడం కరెక్ట్ కాదని సింగ్ వెల్లడించారు.