కమల్ నాథ్ కు ఝలక్….సొంత పార్టీకి వ్యతిరేకంగా రోడ్లపైకి వస్తానన్న సింధియా

మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ ముఖ్యనాయకుడు జ్యతిరాథిత్య సింధియా సీఎం కమల్ నాథ్ పై తిరుగుబాటు చేసేందుకు రెడీ అయ్యాడు. గెస్ట్ టీచర్ల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకుంటే సొంత పార్టీకి వ్యతిరేకంగా తానే రోడ్లపైకి రావాల్సి ఉంటుందని సీఎం కమల్ నాథ్ కు హెచ్చరిక చేశారు.

శుక్రవారం(పిబ్రవరి-14,2020)తికమ్ ఘర్ జిల్లాలోని కుండ్లియా గ్రామంలో తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన చేస్తున్న గెస్ట్ టీచర్లను ఉద్దేశించి మాట్లాడుతూ…మీ డిమాండ్లు నెరవేరుస్తామని మా(కాంగ్రెస్)మేనిఫెస్టోలో చెప్పాం. మేనిఫెస్టో అనేది మాకు పవిత్రమైన పుస్తకం. ప్రతి ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చకపోతే మీతో కలిసి నేను కూడా రోడ్లపైకి వస్తాను. మీరు ఒంటరివాళ్లు అని అనుకోవద్దు. మీ వెంట నెను కూడా ఉన్నాననుకోండి అంటూ నినాదాలు చేస్తున్న గెస్ట్ టీచర్లను ఉద్దేశించి సింధియా ప్రసంగించారు.

2019లోక్ సభ ఎన్నికల్లో గుణ-శివ్ పురి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ చేతిలో ఓడిపోయిన సింధియా  గతంలో కూడా కమల్ నాథ్ సర్కార్ కు ఇలాంటి హెచ్చరికలు చేశారు. 2014లో గుణ-శివ్ పురి స్థానం నుంచి సింధియా ఎంపీగా విజయం సాధించారు. 2018లో మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ముందు..జ్యోతిరాధిత్య సింధియాను భవిష్యత్తు సీఎంగా  ఆయన మద్దతుదారులు ప్రొజెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీలో సినియర్ గా ఉన్న కమల్ నాథ్ కే సీఎం సీటు కేటాయించింది కాంగ్రెస్. ప్రస్తుతం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉత్తరప్రదేశ్ వెస్ట్ బాధ్యతలను జ్యోతిరాధిత్యసింగ్ చూస్తున్నాడు.

ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిపై రెండు రోజుల క్రితం జ్యోతిరాధిత్య సింధియా మాట్లాడుతూ…కొత్త ఆలోచనలు,సిద్ధాంతాలు,వర్కింగ్ స్టైల్ తో కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరకు వెళ్లాల్సిన అవసరముందన్నారు. దేశం మారుతోందని,అదేవిధంగా ప్రజల ఆలోచనా విధానం మారుతోందని,కాంగ్రెస్ కూడా మారి…కొత్త అప్రోచ్ తో ప్రజలకు చేరువకావాల్సిన అవసరం ఉందని సింధియా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Read Here>>గ్రేట్ న్యూస్ : కోవిడ్ – 19 (కరోనా) వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టిన కాలిఫోర్నియా!