Agnipath Scheme Protest : రైళ్ల పునరుధ్దరణకు అధికారుల అత్యవసర సమావేశం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఈరోజు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండతో పలు  రైలు సర్వీసులకు ఆటంకం ఏర్పడింది.

Agnipath Scheme Protest :  కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఈరోజు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండతో పలు  రైలు సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. దీంతో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్    రైల్వేలోని అన్ని శాఖల అధికారులతో ఈ ఉదయం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

సికింద్రాబాద్ రావల్సిన పలు ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు శివారుప్రాంతాలలో నిలిపి వేశారు. సికింద్రాబాద్  నుంచి బయలు దేరాల్సిన  పలు రైళ్లను రద్దు చేశారు.  దీంతో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.   రైలు సర్వీసులను పునరుద్ధరించటానికి రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

సికింద్రాబాద్  రైల్వే స్టేషన్ లో   పరిస్ధితి   పూర్తి స్ధాయిలో   అదుపులోకి   రావటానిక మరికొంత సమయం పట్టే అవకాశం  ఉండటంతో కొన్ని ప్లాట్‌ఫాం లను సిధ్దం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.   ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. నగరంలోని మిగిలిన రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చే అన్ని రహదారులను పోలీసులు మూసి వేశారు.

కాగా …. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా శుక్రవారం ఉదయం భారీ ఎత్తున రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆందోళనకారులు  రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. పార్సిల్ కార్యాలయం లోని  పార్శిళ్లకు నిప్పుపెట్టారు.   ఈ ఘటనలో మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఎంఎంటీఎస్ రైలు  దహనమయ్యాయి. స్టేషన్ చేరుకున్న పోలీసులు ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

ఫైర్ సిబ్బంది, పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినప్పటికీ ఆందోళనకారులు తగ్గకపోవడంతో పోలీసులు కాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మరణించారు. మరికొందరు యువకులకు బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

దాడిలో అజంతా ఎక్స్‌ప్రెస్, శాలిమార్ ఎక్స్‌ప్రెస్, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఎంఎంటీఎస్ రైలు దహనమయ్యాయి. తాజా ఘటనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో భద్రత పెంచారు. అన్ని రైల్వే స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  ఆందోళనతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా  నాంపల్లిరైల్వే స్టేషన్ ను మూసివేశారు. ప్రయాణికులెవరూ నాంపల్లి రైల్వే స్టేషనకు రావద్దని విజ్ఞప్తి  చేశారు.

Also Read :Two Died: సికింద్రాబాద్‌లో పోలీసుల కాల్పులు.. ఇద్దరు మృతి

ట్రెండింగ్ వార్తలు