400మంది కవలలు : సైన్స్ ఛేదించలేని సీక్రెట్ విలేజ్

  • Publish Date - February 25, 2019 / 10:37 AM IST

కొదిన్హి : టెక్నాలజీకి అంతుచిక్కని రహస్యాలెన్నో. టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిందని గొప్పగా చెప్పుకునే ప్రస్తుతం తరుణంలో సైన్స్ పరిజ్ఞానికి కూడా అంతుచిక్కకుండా రహస్యంగా ఉంది ఓ చిన్న గ్రామం. అదే కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలోని కొదిన్హి గ్రామం.
 
ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉన్నట్లే ఆ గ్రామానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది..అంతేకాదు పెద్ద పెద్ద డాక్టర్లు సైతం ఛేదించలేని సైన్స్ రహస్యం ఆ గ్రామం స్పెషల్. అదే కవల పిల్లలు ఎక్కువగా పుట్టటం..ఒకటీ..రెండు.. మూడు కవలలు కాదు.. ఏకంగా 4 వందల మంది కవలల పిల్లలు పుట్టటం ఆ గ్రామం ప్రత్యేకత. 
 

కొదిన్హి గ్రామం ప్రపంచంలోనే ఎక్కువమంది కవలలు జన్మించే ప్రదేశంగా గుర్తించబడింది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఎక్కువ సంఖ్యలో కవలలు జన్మిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 2000 మంది గ్రామస్థులున్న గ్రామంలో 205 కవల జంటలున్నాయి. అంటే దాదాపు 10 శాతం జనాభా కవలలే. 1949 సంవత్సరం నుంచి ఈ గ్రామంలో కవల పిల్లలు జన్మిస్తున్నారట. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ సంఖ్య కేవలం నాలుగు కాగా కొదిన్హి గ్రామంలో ప్రతి 1000 మందిలో 55 మంది పిల్లలు కవలలుగా జన్మిస్తున్నారనే స్పష్టమయ్యింది. 

ఈ కవలల పుట్టుక 1945 నుంచి అని ఆగ్రామం ప్రజలు చెప్తున్నారు. ఆ గ్రామానికి చెందిన వాళ్ళు ఆ గ్రామానికి చెందిన వాళ్లనే పెళ్లి చేసుకుంటున్నారు. ఇదే ఏమో ఆ ట్విన్స్ బర్త్ కి కారణం అని అందరు అనుకున్నారు, కానీ ఇక్కడి మహిళలు,పురుషులు వేరే గ్రామాలకు చెందిన వారిని పెండ్లి చేసుకున్నా, వారికీ కవలలు పుట్టడం మాత్రం ఆగలేదు ఇది డాక్టర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

ఈ కొదిన్హి పల్లెటూరు చూడటానికి చాలా చాలా సుందరమైనదికూడా. ఈ కవలల రహస్యాన్ని ఛేదించటానికి పెద్ద పెద్ద పేరొందిన డాక్టర్లు..స్పెషలిస్ట్ లు కొదిన్హి గ్రామ ప్రజలను పరిశీలించారు.. పరీక్షించారు. కానీ సాధ్యం కాలేదు. ఈ క్రమంలో కొదిన్హి గ్రామం సైన్స్ పరిజ్ఞానానికి అందని ఓ మిస్టరీగా మిగిలిపోయింది. ఆరోగ్యవంతమైన కవలలు పుట్టడం డాక్టర్లకు మరింత ఆశ్చర్యకర అంశం కావటం మరో విశేషంగా చెప్పవచ్చు.