ఇదేంటీ బాసూ : ఉద్యోగిపై థర్డ్ డిగ్రీ.. బూట్లతో తొక్కి చావబాదాడు

  • Publish Date - October 15, 2019 / 12:22 PM IST

ఉద్యోగులపై వారి బాస్‌లు కోపడటం.. తిట్టడం కామన్. ప్రతి ఆఫీసులోని ఉద్యోగికి ఇలాంటి అనుభవం సాధారణమే. కానీ, ఉద్యోగిని భౌతికంగా హింసించడం జరగదు. బెంగళూరులోని ఓ సెక్యూరిటీ ఏజెన్సీ యజమాని మాత్రం తన కింది స్థాయి ఉద్యోగిపై భౌతిక దాడికి దిగాడు. విచక్షణ లేకుండా బూట్లతో తొక్కి హింసించాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాస్.. ఉద్యోగిని కింద పడేసి అతడి చేతులను గట్టిగా లాగి తన బూట్లతో తొక్కడం వీడియోలో చూడవచ్చు. 

బాధితుడి చేతులను వెనక్కి విరుస్తూ తీవ్రంగా హింసించాడు. అంతటితో ఆగకుండా బాధితుడి తలపై నిలబడి బూటు కాళ్లతో నేలకేసి తొక్కడం హింసాత్మకంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఒకరు జోక్యం చేసుకుని యజమానిని అడ్డుకున్నాడు.

వీడియో వైరల్ కావడంతో పోలీసులు సెక్యూరిటీ యజమాని సలీం ఖాన్ అనే వ్యక్తిగా గుర్తించారు. సలీం సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఖాన్ పరారీలో ఉండగా.. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇంతకీ సలీం తన ఉద్యోగిని ఏ కారణంతో హింసిస్తున్నాడనేది క్లారిటీ లేదు. వైరల్ అవుతున్న వీడియో ఇదే..