J&K Terrorists : దెబ్బకొట్టారు..తిప్పికొట్టారు, ఐదుగురు ఉగ్రవాదుల హతం
పక్కా సమాచారంతో ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుని ఆపరేషన్ నిర్వహించాయి.
- madhu
- Published On : November 17, 2021 / 07:46 PM IST
Jammu
Security Forces : భారతదేశంలోకి చొచ్చుకొచ్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నాలు ఇంకా ఆపడం లేదు. దీంతో ప్రకృతి రమణీయతకు నెలవైన అందమైన కశ్మీర్ లో కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. ఆ ప్రదేశాల్లో రక్తంతో తడిసిపోతున్నాయి. ఇటీవలే మణిపూర్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో కల్నల్ కుటుంబంతో సహా ఐదుగురు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను భారత ఆర్మీ సీరియస్ గా తీసుకుంది. ప్రతికారం తీర్చుకోవాలని భావించారు. అందులో భాగంగా ఉగ్రవాదుల ఏరివేత ప్రయత్నాలు ముమ్మరం చేపట్టాయి. అందులో భాగంగా…జమ్ముకశ్మీర్ కుల్గాంలో భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది. రెండు చోట్లు వేర్వేరుగా జరిగిన ఎన్‌కౌంటర్‌లలో భద్రబలగాలు ఐదుగురు ఉగ్రవాదులను కాల్చి చంపాయి.
Read More : CBI Raids : తిరుపతిలో ఛైల్డ్ పోర్న్ వీడియోలతో వ్యాపారం, సీబీఐ దాడులు
పోంబై, గోపాల్ పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పక్కా సమాచారంతో ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుని ఆపరేషన్ నిర్వహించాయి. మరోవైపు పుల్వామాలో పోలీసులు ఇద్దరు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరిని అమీర్ బషీర్, ముక్తార్ భట్‌గా గుర్తించారు. వీరు భారీ ఉగ్రదాడికి కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు బారాముల్లా జిల్లాలో మరోసారి టెర్రరిస్టులు రెచ్చిపోయారు. పల్హాలాన్ చౌక్‌లో భారత భద్రతా బలగాలే లక్ష్యంగా గ్రనేడ్లతో దాడికి తెగబడ్డారు.
Read More : Maoists Release : భార్య విజ్ఞప్తి.. భర్తను వదిలిన మావోయిస్టులు!
ఈ దాడుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లతో సహా నలుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ జవాన్లను, పౌరులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. గ్రనేడ్ల దాడి ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న బలగాలు.. ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.. గ్రనేడ్ల దాడి జరిగిన ఏరియాను బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఉగ్రవాదుల ఆచూకీ కోసం బలగాలు కూంబింగ్ చేపట్టాయి.
