CBI Raids : తిరుపతిలో ఛైల్డ్ పోర్న్ వీడియోలతో వ్యాపారం, సీబీఐ దాడులు

తిరుపతిలో చిన్నారుల అశ్లీల వీడియోలతో వ్యాపారం చేస్తున్న మోహన్ కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు.

CBI Raids : తిరుపతిలో ఛైల్డ్ పోర్న్ వీడియోలతో వ్యాపారం, సీబీఐ దాడులు

Cbi Tpt

CBI Raids 77 Places : తిరుపతిలో చిన్నారుల అశ్లీల వీడియోలతో వ్యాపారం చేస్తున్న మోహన్ కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. యశోదనగర్‌లో ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్న  మోహనకృష్ణను సీబీఐ అదుపులోకి తీసుకుంది. మోహన్ కృష్ణ పిల్లల పోర్న్ వీడియోలు అప్లోడింగ్, షేరింగ్ చేస్తున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. చైల్డ్ పోర్న్‌ వీడియోల వ్యవహారంపై దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దాడులకు దిగింది. ఏకకాలంలో 77 చోట్ల మెరుపుదాడులు చేసింది.

Read More : CM KCR : మహా ధర్నాలో పాల్గొననున్న సీఎం కేసీఆర్

ఆన్‌లైన్‌ వేదికగా చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులు జరగిన కేసును సీబీఐ సీరియస్‌గా తీసుకుంది. ఈ నెల 14వ తేదీన 23 కేసులు నమోదు చేసింది. 83 మందిని అదుపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీ యథేచ్ఛగా సాగుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో కేంద్రీయ దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగింది.  ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో పలు బృందాలు తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read More : Chiranjeevi : వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలి – చిరంజీవి హాట్ కామెంట్స్

బీహార్‌, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఆన్‌లైన్‌ సెక్స్‌ రాకెట్లపై దాడులు చేశారు సీబీఐ అధికారులు. అసాంఘిక కార్యకలాపాలు, సెక్స్ పార్లర్లుగా మారిన పలు మసాజ్ సెంటర్ల, ఇంటర్‌నెట్ కెఫేలపైనా ఈ దాడులు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఛైల్డ్ సెక్స్ రాకెట్ బిజినెస్‌తో ముడిపడి ఉన్న వారిని వదలబోమంటున్నారు సీబీఐ అధికారులు.