CM KCR : మహా ధర్నాలో పాల్గొననున్న సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహాధర్నాలో పాల్గొననున్నారు. ధర్నా వేదికలో ఆయన కూర్చొన్నారు.

CM KCR : మహా ధర్నాలో పాల్గొననున్న సీఎం కేసీఆర్

Kcr

TRS Maha Dharna : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహాధర్నాలో పాల్గొననున్నారు. ధర్నా వేదికలో ఆయన కూర్చొన్నారు. అధికారంలో ఉన్న పార్టీ ధర్నా చేస్తుండడం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి ఆయన సిద్ధమయినట్లు కనిపిస్తోంది. ప్రధానంగా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరిని తీవ్రంగా పరిగణిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ధాన్యం కొనుగోళ్లు, విభజన హామీల డిమాండ్లతో పాటు ఇతర అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ..మహాధర్నా చేపట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Read More : Chiranjeevi Politics : రాజకీయాలను వదిలి చిరంజీవి మంచి పని చేశారు

ఇందిరాపార్కు వద్ద జరిగే ఈ ధర్నాలో పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సీఎం కేసీఆర్ సూచించారు. స్వయంగా ధర్నాలో పాల్గొనడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని సీఎం కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా..మహాధర్నాలో పాల్గొనాలని తాజాగా నిర్ణయించారు. ధర్నా కార్యక్రమం 2021, నవంబర్ 18వ తేదీ గురువారం జరుగనుంది. అంతకంటే ముందు..బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు సీఎం కేసీఆర్. లేఖలో ధాన్యం కొనుగోలు అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏడాదిగా ధాన్యం ఎంతకొంటారో చెప్పడం లేదని, వరిసాగు విస్తీర్ణం పెరుగుతున్నా కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వలేదన్నారు.

Read More : Vishwa Bhushan : ఏపీ గవర్నర్ విశ్వభూషణ్‌కు కరోనా పాజిటివ్.. ఆరోగ్యపరిస్థితిపై సీఎం జగన్ ఆరా

ఇక మహాధర్నా ప్రాంగణాన్ని మంత్ర హరీష్ రావు పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను అడగి తెలుసుకున్నారు. ఏర్పాట్ల‌ను మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో క‌లిసి హ‌రీశ్‌రావు ప‌రిశీలించారు. రాష్ట్ర రైతుల ప‌క్షాన కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఈ ధ‌ర్నా నిర్వ‌హించ‌బోతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. లక్షలాది మంది రైతుల పక్షాన..కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ…ఈ మహాధర్నా చేపట్టబోతున్నామన్నారు. మ‌హాధ‌ర్నా శాంతియుతంగా, ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా చేయ‌బోతున్నట్లు, ఈ ధ‌ర్నాలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్య‌లో పాల్గొంటారని మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. మహాధర్నా అనంతరం కేంద్ర వైఖరిలో ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.