Maoists Release : భార్య విజ్ఞప్తి.. భర్తను వదిలిన మావోయిస్టులు!

ఓ మహిళ చేసిన విజ్ఞప్తికి మావోయిస్టుల మనస్సు కరిగిపోయింది. తన భర్తకు ఎలాంటి ఆపద తలపెట్టవద్దని, క్షేమంగా విడిచిపెట్టాలని ఆమె కోరడంతో..ప్రజాకోర్టు నిర్వహించి..ఆయన్ను వదిలిపెట్టారు.

Maoists Release : భార్య విజ్ఞప్తి.. భర్తను వదిలిన మావోయిస్టులు!

Maiost

Maoists Release Kidnapped : ఆ మహిళ చేసిన విజ్ఞప్తికి మావోయిస్టుల మనస్సు కరిగిపోయింది. తన భర్తకు ఎలాంటి ఆపద తలపెట్టవద్దని, క్షేమంగా విడిచిపెట్టాలని ఆమె కోరడంతో..ప్రజాకోర్టు నిర్వహించి..ఆయన్ను వదిలిపెట్టారు. దీంతో ఆమె నక్సలైట్లకు కృతజ్ఞతలు తెలిపారు. సివిల్ ఇంజినీర్ ను నక్సలైట్లు కిడ్నాప్ చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. భర్త విడుదల కోసం రెండేళ్ల కూతురిని చంకలో ఎత్తుకుని ఆమె అడవిలోకి వెళ్లడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన బీజాపూర్ జిల్లా మన్ కేళీ వద్ద చోటు చేసుకుంది.

Read More : Rohit Sharma: తొమ్మిదేళ్ల ముందే కెప్టెన్సీ గురించి రోహిత్.. వైరల్‌గా మారిన ట్వీట్

ఏడు రోజుల క్రితం బీజాపూర్ జిల్లా మన్ కేళీ వద్ద సివిల్ ఇంజినీర్ గా పనిచేస్తున్న అజయ్ లక్రా, అటెండర్ లక్ష్మణ్ లను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాతి రోజు…లక్ష్మణ్ ను విడుదల చేసిన మావోలు..అజయ్ లక్రాను తమవద్దే ఉంచుకున్నారు. విషయం తెలుసుకున్న అజయ్ లక్రా భార్య..అర్పిత తీవ్ర భయాందోళనలకు గురైంది. తన భర్తను ఏం చేస్తారని మనోవేదనకు గురైంది. వెంటనే వారి దగ్గరకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.

Read More : Less Courbons by Women : మహిళలు కీల‌క హోదాల్లో ఉంటే..గ్లోబల్ వార్మింగ్ త‌గ్గుతుంది

రెండేళ్ల కూతురిని ఎత్తుకుని స్థానికంగా ఉన్న జర్నలిస్టుల సాయంతో అడవి బాట పట్టింది. మావోయిస్టుల వద్దకు చేరుకుని..తన భర్తను క్షేమంగా విడిచిపెట్టాలని కోరింది. అనంతరం ప్రజాకోర్టును నిర్వహించిన మావోయిస్టులు..2021, నవంబర్ 17వ తేదీ బుధవారం విడుదల చేశారు. దీంతో అర్పిత సంతోషం వ్యక్త చేసింది. భర్తతో..ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.