Rohit Sharma: తొమ్మిదేళ్ల ముందే కెప్టెన్సీ గురించి రోహిత్.. వైరల్‌గా మారిన ట్వీట్

రోహిత్ శర్మ రెగ్యూలర్ కెప్టెన్ గా జరుగుతున్న తొలి మ్యాచ్ కావడంతో రోహిత్ అభిమానులకు పండగే. ఇదిలా ఉంటే తొమ్మిదేళ్ల క్రితం కెప్టెన్సీ గురించి రోహిత్ చేసిన ట్వీట్ ఈ సందర్భంగా వైరల్..

Rohit Sharma: తొమ్మిదేళ్ల ముందే కెప్టెన్సీ గురించి రోహిత్.. వైరల్‌గా మారిన ట్వీట్

Rohit Shrma

Rohit Sharma: టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత టీమిండియా తొలిసారి ఆడుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడబోతుంది. టీ20 సిరీస్ లో భాగంగా బుధవారం జైపూర్ వేదికగా మ్యాచ్ ఆరంభం కానుంది. రోహిత్ శర్మ రెగ్యూలర్ కెప్టెన్ గా జరుగుతున్న తొలి మ్యాచ్ కావడంతో రోహిత్ అభిమానులకు పండగే. ఇదిలా ఉంటే తొమ్మిదేళ్ల క్రితం కెప్టెన్సీ గురించి రోహిత్ చేసిన ట్వీట్ ఈ సందర్భంగా వైరల్ అయింది.

కొన్నేళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో సక్సెస్‌ఫుల్ కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ కేవలం బ్యాటింగ్ పైనే ఫోకస్ చేస్తానంటూ.. కెప్టెన్సీని వదిలిపెట్టేశాడు. అలా రోహిత్ టీ20 పగ్గాలు అందుకున్నాడు. 2012లోనూ జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ రోహిత్ కెప్టెన్ గా మ్యాచ్ ఆడాడు. ముంబై రంజీ ట్రోఫీ టీంకు కెప్టెన్సీ వహించాడు.

‘జైపూర్ లో దిగాం. అవును నేనే కెప్టెన్సీ వహిస్తున్నా. బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా’ అంటూ రోహిత్ అప్పట్లో ట్వీట్ పెట్టాడు. అనుకోకుండా బుధవారం జరుగుతున్న మ్యాచ్ కు ట్వీట్ కరెక్ట్ గా సెట్ అయింది. ఇండియా ఫుల్ టైం స్కిప్పర్ గా గా రోహిత్ ఎంపిక అవడం, ట్వీట్ చేయడం యాదృచ్చికంగా సెట్ అయ్యాయి.

…………………………………………… : మహిళలు కీల‌క హోదాల్లో ఉంటే..గ్లోబల్ వార్మింగ్ త‌గ్గుతుంది

ఫస్ట్ టీ20కు ముందు ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫిరెన్స్ లో రోహిత్ వాళ్ల అజెండా గురించి ఇలా అన్నాడు.

‘ఫార్మాట్ అనేది చాలా ఇంపార్టెంట్. మేం దానికి సెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాం. మాకు కొంచెం సమయం దొరికింది. ఈ ఫార్మాట్ లో ఇండియా చాలా బ్రిలియంట్. ఐసీసీ టోర్నమెంట్ గెలవకపోవడం ఒక విషయం మాత్రమే. టీంగా మేం బాగా ఆడాం. చిన్నచిన్న పొరబాట్లను పూర్తి చేయాల్సి ఉంది. ఒక టీంగా ఇది మాకు పెద్ద ఛాలెంజ్. ప్రతి టీంలో ఇలాంటివి ఉంటాయి. వాటిని పెద్దవిగా చేసుకోకూడదు. మేం ఒక టెంప్లేట్ ను ఫాలో అవుదామనుకుంటున్నా. టీంకు ఏది ఉత్తమమమో అదే చేస్తాం’ అని రోహిత్ అన్నాడు.