Semiconductor : సెమీకండక్టర్ల డిజైన్,తయారీ ప్రాజెక్టుకు రూ.76 వేల కోట్లు..కేబినెట్ నిర్ణయంపై మోదీ ట్వీట్

ఆత్మనిర్భర్​ భారత్​ కార్యక్రమాన్ని బలోపేతం చేసేలా కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రోజువారీ జీవితంలో ఎలక్ట్రానిక్స్​ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వాటి తయారీలో

Chip2

Semiconductor :  ఆత్మనిర్భర్​ భారత్​ కార్యక్రమాన్ని బలోపేతం చేసేలా కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రోజువారీ జీవితంలో ఎలక్ట్రానిక్స్​ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వాటి తయారీలో సెమీకండక్టర్​ చిప్పులు కీలక భాగం కాగా… సెమీకండక్టర్ల అభివృద్ధి, తయారీ పర్యావరణ వ్యవస్థ కోసం రూ.76వేల కోట్లతో కూడిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

దీంతో రానున్న ఐదు లేదా ఆరు సంవత్సరాల్లో మన దేశంలోనే సెమీకండక్టర్ చిప్స్ డిజైన్, తయారీ జరుగుతుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ప్రోగ్రామ్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ సెమీకండక్టర్స్ అండ్ డిస్‌ప్లే మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ అని పేరు పెట్టినట్లు చెప్పారు.

అదేవిధంగా, యూపీఐ, రుపీ డెబిట్​ కార్డుతో జరిపిన డీజిటల్​ లావాదేవీలకు సంబంధించి రూ.1300 కోట్ల రీఎంబర్స్​మెంట్​ చేసేందుకు కూడా కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. నవంబర్​ లో రూ. 7.56 లక్షల కోట్ల విలువైన 423 కోట్ల డిజిటల్​ లావాదేవీలు జరిగినట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ తెలిపారు. డిజిటల్​ చెల్లింపులను ప్రోత్సహించేందుకు వచ్చే ఏడాది రూ.13వందల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పారు.

మరోవైపు, సెమీకండక్టర్స్​పై కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఆ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. దీని ద్వారా ఆత్మనిర్భర్​ భారత్​ కార్యక్రమం బలోపేతమవుతుందని ప్రధాని మోదీ ట్వీట్​ చేశారు. ఈ పథకం ఎలక్ట్రానిక్స్​ తయారీలో కొత్త శకానికి నాంది పలుకుతుందని ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ తెలిపారు.

ALSO READ Punjab Election : సిద్ధూతో మంతనాలు..కాంగ్రెస్ లోకి హర్భజన్ సింగ్!