సీనియర్ ICMR సైంటిస్ట్ కు కరోనా పాజిటివ్

ఒక వైపు కరోనా కట్టడికి పరిశోధనలు చేస్తూనే.. మరోవైపు వైరస్ పట్ల ప్రజలను అప్రమత్తం చేసే ప్రభుత్వ సంస్థ… భారత వైద్య పరిశోధనా మండలి(ICMR). కానీ ఇప్పుడు ICMRలో పనిచేసే ఓ సీనియర్ సైంటిస్ట్ కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ముంబైకి చెందిన సైంటిస్ట్ గతవారం ఢిల్లీ వచ్చాడు. ఢిల్లీలోని ICMR హైడ్ క్వార్టర్స్‌కు వెళ్లారు.

ముంబైలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయనకు కరోనా పరీక్షలు చేశారు. ఆదివారం ఉదయం ఆయనకు కరోనా సోకినట్లు కన్ఫర్మ్ అయింది. ఈ సైంటిస్ట్..ముంబైలోని ICMRకి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ రీప్రోడెక్టివ్‌ హెల్త్‌‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. సైంటిస్ట్ కు కరోనా సోకడంతో ఢిల్లీలోని ICMR బిల్డింగ్ ను శానిటైజ్ చేస్తున్నారు.

రెండు రోజులు పాటు ICMR బిల్డింగ్ ను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించారు. కేవలం కోవిడ్ 19 కోర్ టీమ్ మాత్రమే ఆపీసుకు వస్తోందని.. మిగిలిన సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని ICMR అధికారులు చెప్పారు. ఇక కరోనా బారినపడ్డ ఆ శాస్త్రవేత్త ఎవరెవరిని కలిశాడన్న దానిపై ఆరా తీస్తున్నారు. గతవారం ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవతో పాటు పలువురు శాస్త్రవేత్తలు, సిబ్బంది పాల్గొన్న ఓ సమావేశానికి ఈ శాస్త్రవేత్త హాజరయ్యారు. ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించారు.

Read: కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టినవారిలో కోల్‌కతా మహిళ