×
Ad

Maharashtra : భార్య, మేనల్లుడిని తుపాకీతో కాల్చి చంపి, ఆత్మహత్య చేసుకున్న పోలీసు అధికారి

సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో, ఏసీపీ మొదట తన భార్య తలపై కాల్పులు జరిపారని అధికారి తెలిపారు. తుపాకీ కాల్పులు విన్న అతని కొడుకు, మేనల్లుడు పరుగున వచ్చి తలుపు తెరిచారని, వెంటనే గైక్వాడ్ తన మేనల్లుడిపై కాల్పులు జరపడంతో అతని ఛాతీకి గాయం అయిందని తెలిపారు.

  • Published On : July 24, 2023 / 02:58 PM IST

Police shoot dead wife and nephew

Police Shoots Dead Wife And Nephew : మహారాష్ట్రలోని పూణేలో దారుణం జరిగింది. సీనియర్ పోలీసు అధికారి తన భార్యను, మేనల్లుడిని కాల్చి చంపి, ఆపై తనను తానూ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 57 ఏళ్ల అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) భరత్ గైక్వాడ్ సోమవారం పూణె నగరంలోని తన ఇంటి వద్ద భార్య, మేనల్లుడిని తుపాకీతో కాల్చి చంపాడని, అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసున్నాడని పోలీసు అధికారి తెలిపారు.

పూణేలోని బానర్ ప్రాంతంలోని ఏసీపీ భరత్ గైక్వాడ్ బంగ్లా వద్ద సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని చతుర్‌శృంగి పోలీస్ స్టేషన్ అధికారి పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు. కాగా, గైక్వాడ్‌ అమరావతి ఏసీపీగా విధులు నిర్వహించి ఇంటికి వచ్చారని పోలీసులు వెల్లడించారు.

Dalit Student : యూపీలో దళిత విద్యార్థిని దారుణ హత్య.. తుపాకీతో కాల్చి చంపిన ఇద్దరు వ్యక్తులు

సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో, ఏసీపీ మొదట తన భార్య తలపై కాల్పులు జరిపారని అధికారి తెలిపారు. తుపాకీ కాల్పులు విన్న అతని కొడుకు, మేనల్లుడు పరుగున వచ్చి తలుపు తెరిచారని, వెంటనే గైక్వాడ్ తన మేనల్లుడిపై కాల్పులు జరపడంతో అతని ఛాతీకి గాయం అయిందని తెలిపారు.

తర్వాత ఏసీపీ గైక్వాడ్ తుపాకీతో తన తలపై కాల్చుకున్నాడని పేర్కొన్నారు. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని చెప్పాడు. మృతుల్లో ఇద్దరు పోలీసు అధికారి భార్య మోని గైక్వాడ్ (44), మేనల్లుడు దీపక్ (35)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగుతోందని తెలిపారు.