Samosa
Samosa : సమోసా అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు. సాయంత్రమైందంటే.. ఓ చాయ్.. సమోసా కడుపులో వేసుకునే వారు చాలామందే ఉంటారు. అందులో ఆలు సమోసా అంటే మరి ఇష్టంగా తీస్తుంటారు. నగరాల్లో సమోసాలు విరివిగా లభిస్తాయి. కానీ సీరియల్ నంబర్ ఉన్న సమోసాలను ఎప్పుడు గమనించి ఉండరు.
అయితే సమోసాలకు ఆర్డర్ ఇచ్చిన నితిన్ మిశ్రా అనే ఒక వ్యక్తి వాటిపై క్రమ సంఖ్య ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. దీంతో ఫోటోలు తీసి ట్విట్ చేశారు. ‘నేను ఆర్డర్ చేసిన సమోసాలపై సీరియల్ నంబర్లు ఉన్నాయి. టెక్ ప్లీజ్.. నా హల్వాయికి దూరంగా ఉండవా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
కాగా క్రమసంఖ్య ఉన్న సమోసాలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఈ నంబర్లను చూసి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే మరికొందరు.. కౌంట్ మిస్ అవకుండా ఉండేందుకు వేసి ఉంటారని చెబుతున్నారు. ఇంకొందరు హోటల్ సిబ్బంది తినకుండా ఉండేందుకు ఈ విధంగా చేసి ఉంటారని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ క్రమ సంఖ్య ఉన్న సమోసాల ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Samosas I ordered had serial numbers ? Can tech pls stay away from my halwai. pic.twitter.com/DKo1duIiC9
— Nitin Misra (@nitinmisra) September 1, 2021