Covishield to cost ₹600 per dose: రూ. 600కి కోవిషీల్డ్ వ్యాక్సిన్. ప్రైవేట్ ఆసుపత్రులకు సీరమ్ కట్టిన రేటు

బహిరంగ మార్కెట్‌లో కోవిషీల్డ్ ధరలను సీరమ్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోస్ ధర 400 రూపాయలకు ఇవ్వనుంది.

covshield prices in the open market : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి చేసేందుకు బహిరంగ మార్కెట్ లో వ్యాక్సిన్ అమ్మకాలకు అనుమతి లభించింది. బహిరంగ మార్కెట్‌లో కోవిషీల్డ్ ధరలను సీరమ్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోస్ ధర 400 రూపాయలకు ఇవ్వనుంది.

ప్రైవేట్ ఆస్పత్రులకు ఇచ్చే డోస్ ధర రూ.600గా నిర్ణయించింది. మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్ ఇవ్వనుంది. సీరం ఛార్జిలకు అదనంగా ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాక్సిన ఛార్జీలు వసూలు చేయనున్నాయి.

బహిరంగ మార్కెట్‌లోనూ వ్యాక్సిన్‌ విక్రయాలకు కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. బహిరంగ మార్కెట్‌లో వ్యాక్సిన్ ధరలపై నిర్ణయం తీసుకున్నారు. 50 శాతం టీకాలు అమ్ముకునేందుకు ఉత్పత్తి సంస్థలకు అనుమతి ఇచ్చారు. 50 శాతం టీకాలు రాష్ట్రాలకు, మార్కెట్‌లో విక్రయించుకునే వెసులుబాటు కల్పించారు.

ఉత్పత్తి సంస్థలు టీకాలను మార్కెట్లో నిర్దేశిత ధరకు అమ్ముకునే అవకాశం కల్పించారు. ఉత్పత్తి సంస్థల నుంచి వ్యాక్సిన్లను నేరుగా కొనేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇచ్చారు. 45 ఏళ్లు నిండినవారికి యథావిధిగా కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు