ముస్లింల కోసం చాలా దేశాలున్నాయి…హిందువులకే లేదు

ప్రపంచంలో హిందువుల కోసం ప్రత్యేకంగా ఏ దేశం లేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్యరాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ఆందోళనలు అర్థరహితమని ఆయన అన్నారు.

బుధవారం(డిసెంబర్-18,2019)ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…గతంలో నేపాల్ హిందూ దేశంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఒక్క హిందూ దేశం కూడా లేదు. కాబట్టి హిందువులు,సిక్కులు ఎక్కడికి వెళ్లారు?ముస్లింల కోసం చాలా ముస్లిం దేశాలున్నాయి.అక్కడ వాళ్లు పౌరసత్వం పొందవచ్చు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి. మనదేశంలోని ఏ ఒక్క ముస్లిం వ్యక్తికి మేము వ్యతిరేకం కాదు. కొన్ని రాజకీయ పార్టీలు మైనార్టీల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. వివిక్ష రాజకీయాలకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని గడ్కరీ అన్నారు.
 

ట్రెండింగ్ వార్తలు