Severe Heat Wave In Delhi : ఢిల్లీలో తీవ్రమైన హీట్‌ వేవ్స్‌

తీవ్రమైన హీట్‌ వేవ్స్‌ కారణంగా దేశ రాజధానితో పాటు చుట్టుపక్కల సిటీల్లో ఎండలు దంచికొడుతున్నాయి.

Severe Heat Wave In Delhi, తీవ్రమైన హీట్‌ వేవ్స్‌ కారణంగా దేశ రాజధానితో పాటు చుట్టుపక్కల సిటీల్లో ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం ఢిల్లీలో గరిష్ఠంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత,గుర్గావ్‌లో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ పాలమ్‌ అబ్జర్వేటరీ తెలిపింది. రెండు నగరాల్లో ఉష్ణోగ్రత సాధారణం కంటే ఏడు డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా ఉందని తెలిపింది. ఒక్కసారిగా పెరిగిన ఎండలతో దేశ రాజధానిలో విద్యుత్‌ వినియోగం బాగా పెరిగింది. ఎండ వేడిని తట్టుకోలేక ఎయిర్‌ కండిషన్ల వినియోగానికి వైపు మొగ్గు చూపారు. గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ బుధవారం 6,921 మెగావాట్లకు పెరిగిందని, ఈ వేసవిలో ఇప్పటి వరకు ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు.

మరోవైపు, జూలై 7వ తేదీ వరకు రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని, అప్పటి వరకు ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. శుక్ర, శనివారాల్లో హీట్‌ వేవ్స్‌ కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుతాయని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు