Number Plate: S. E. X అక్షరాలతో ఇష్యూ అయిన నంబర్ ప్లేట్

కొద్ది రోజులుగా ఢిల్లీ ఆర్టీఓ ఆఫీసులో ఓ వింత సమస్య ఎదురవుతుంది. E, X అనే అక్షరాలతో సిరీస్ మొదలవుతుండటమే అసలు ప్రాబ్లమ్. ఢిల్లీలో టూ వీలర్స్ నెంబర్ ప్లేట్ మీద కచ్చితంగా S ఉండాలి..

Number Plate: కొద్ది రోజులుగా ఢిల్లీ ఆర్టీఓ ఆఫీసులో ఓ వింత సమస్య ఎదురవుతుంది. E, X అనే అక్షరాలతో సిరీస్ మొదలవుతుండటమే అసలు ప్రాబ్లమ్. ఢిల్లీలో టూ వీలర్స్ నెంబర్ ప్లేట్ మీద కచ్చితంగా S ఉండాల్సిందే. ఇక దాంతో పాటు EXసిరీస్ నడుస్తుండటంతో వచ్చిందే ఈ తలనొప్పి.

ఉదాహరణకు ఢిల్లీలో నెంబర్ ప్లేట్ మీద DL 2 C AD 1234 ఇలా ఉంటాయి. DL అంటే ఢిల్లీ, 2 అంటే తూర్పు జిల్లా, C అంటే కార్ అని, అదే టూ వీలర్ అయితే S ఉంటుంది. ఇక నెంబర్ కంటే ముందు వచ్చే సిరీస్ AD అనే రెండు అక్షరాలు.

అందుకే టూవీలర్స్ మీద ఉండే Sతో పాటుగా ప్రస్తుతమున్న EXసిరీస్ వాహనదారులకు ఇబ్బందిగా మారుతుంది. ఎవరైనా ఫ్యామిలీ పర్సన్ ఆ రిజిష్ట్రేషన్ నెంబర్ ప్లేట్ తో బయటకు వెళ్తే ఎలా ఎదుర్కోవాలనే ప్రశ్న కచ్చితంగా వెంటాడుతుంది. .

……………………………………………….: ట్విట్టర్ సీఈఓతో రిలేషన్‌పై శ్రేయా ఘోషల్ ట్వీట్

దీపావళి రోజున కూతురి కోసం తండ్రి స్కూటీ గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాడు. కానీ, నెంబర్ ప్లేట్ పై ఉన్న రిజిష్ట్రేషన్ నెంబర్ చూసి ఒక్కసారి కూడా బయటకు తీసుకెళ్లలేకపోయాడు. ఆర్టీఓకు వెళ్లి నెంబర్ ప్లేట్ మార్చాలని, డీలర్ ను కూడా అడిగినప్పటికీ దురుసు ప్రవర్తనతో కూడిన సమధానం తప్ప లాభం లేదు.

ట్రెండింగ్ వార్తలు