Ayodhya Rama Statue: నేపాల్ నుంచి శాలిగ్రామ శిలలు వచ్చేస్తున్నాయ్.. రేపు బీహార్‌లోకి ఎంట్రీ .. అయోధ్యకు ఎప్పుడంటే?

అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అక్కడ ప్రతిష్టించే రాముడి విగ్రహం కోసం నేపాల్‌లోని గండకీ నది నుంచి శాలిగ్రామ శిలలను తీసుకువస్తున్నారు. ఈ శాలిగ్రామ శిలలతో మాత్రమే రాముడి విగ్రహాన్ని తయారు చేయనున్నారు. ఆవి అయోధ్యకు ఫిబ్రవరి 2న చేరుకుంటాయి.

Ayodhya Rama Statue: అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అక్కడ ప్రతిష్టించే రాముడి విగ్రహం కోసం నేపాల్‌లోని గండకీ నది నుంచి శాలిగ్రామ శిలలను తీసుకువస్తున్నారు. ఈ శాలిగ్రామ శిలలతో మాత్రమే రాముడి విగ్రహాన్ని తయారు చేయనున్నారు. రెండు శాలిగ్రామ రాళ్లను ఎంపిక చేసి వాటిని ప్రత్యేక పూజలు నిర్వహించి తరలిస్తున్నారు. అవి అయోధ్యకు ఫిబ్రవరి 2న చేరుతాయి. ఈ రెండు శాలిగ్రామ శిలల బరువు 127 క్వింటాళ్లు. నెలల తరబడి వెతుకులాట అనంతరం ఈ శాలిగ్రామ శిలలు దొరికాయని నిపుణులు చెబుతున్నారు.

Saligrama rocks

ఈ రెండు శాలిగ్రామ శిలలు రెండు రోజుల క్రితం నేపాల్‌లోని పోఖారా సమీపంలోని గండకీ నది నుంచి క్రేన్ సహాయంతో రెండు పెద్ద ట్రక్కుల్లో తరలిస్తున్నారు. శుక్రవారం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వీటిని అయోధ్యకు తరలింపు ప్రక్రియను చేపట్టారు. ఇవి అయోధ్యకు చేరుకోవాలంటే నాలుగు రోజుల సమయం పడుతుంది. శుక్రవారమే వాటి తరలింపు ప్రారంభమైంది. జనక్‌పూర్‌లో ప్రత్యేక పూజల అనంతరం జనవరి 30న ఉదయం 8.30గంటలకు బీహార్‌లోని మధుబని జిల్లా సరిహద్దు నుండి శాలిగ్రామ శిలలు భారత్‌లోకి ప్రవేశిస్తాయి. మధుబని నుంచి సహర్ ఘాట్ బ్లాక్‌కు చేరుకుంటాయి.

Saligrama rocks

అక్కడి నుంచి కంపోల్ స్టేషన్ మీదుగా, దుర్భంగాలోని మాధవి నుంచి నాలుగు లేన్ల రహదారి ద్వారా ముజఫర్‌పూర్‌కు చేరుకుంటాయి. మజఫర్‌పూర్ నుంచి త్రిపుర కోఠి ససముసా సరిహద్దు నుంచి గోపాల్ గంజ్ మీదుగా యూపీలోకి ప్రవేశిస్తుంది. 31న మధ్యాహ్నం 2గంటలకు గోరఖ్ పూర్ గోరక్ష పీఠానికి చేరుకుంటాయి. ఈ శాలిగ్రామ శిలలకు అక్కడి ఆచారాలతో పూజలు చేస్తారు. సీఎం యోగి ఆధిత్యనాథ్ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఫిబ్రవరి 2న ఈ శాలిగ్రామ శిలలు అయోధ్యకు చేరుకుంటాయి.

Saligrama rocks

ఈ శాలిగ్రామ శిలలు భారత్ భూభాగంలోకి ప్రవేశించిన సమయం నుంచి అయోధ్య వరకు సాధువులు, ఋషులు, మహంతులు, విశ్వహిందూ పరిషత్ వారు ప్రత్యేక పూజల ద్వారా తరలిస్తారు. ఇదిలాఉంటే నేపాల్ సరిహద్దు వరకు శాలిగ్రామ శిలలు తరలించే సమయంలో నేపాల్ హోంమంత్రి, స్వయంగా ప్రధానితో పాటు 25మంది ప్రముఖులు రానున్నారు. ఆ తర్వాత ఇండియాలో కూడా వారి ప్రయాణం సాగుతుందని సమాచారం.

Saligrama rocks

శాలిగ్రామ రాళ్లను గ్రంథాలలో విష్ణు స్వరూపంగా పరిగణిస్తారు. వైష్ణవులు శాలిగ్రామ దేవుడిని పూజిస్తారు. నేపాల్ లోని గండకీ నదిలో ఎక్కువ ఈ శాలిగ్రామ రాళ్లు కనిపిస్తాయి. నేపాల ప్రజలు ఈ రాళ్లను కనుగొని పూజిస్తారు.

ట్రెండింగ్ వార్తలు