Sharad Pawar : శ‌ర‌ద్ పవార్‌కు కరోనా పాజిటివ్..

నేషనలిస్ట్ కాంగ్రెస్ చీఫ్ శరద్ పవార్ కూడా కరోనా బారినపడ్డారు. తనకు కరోనా సోకిందనే విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు.

Sharad Pawar : దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. మొదటి వేవ్, రెండో వేవ్ కంటే వేగంగా మూడో వేవ్ రూపంలో కరోనా వ్యాపిస్తోంది. రాజకీయ, సినీప్రముఖులు ఒక్కొక్కరుగా కరోనా బారినపడుతున్నారు. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ చీఫ్ శరద్ పవార్ కూడా కరోనా బారినపడ్డారు. తనకు కరోనా సోకిందనే విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు.

‘నాకు ఈరోజు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయినా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నా వైద్యుడు సూచించిన విధంగా చికిత్స తీసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా నాతో కాంటాక్ట్‌లో ఉన్న వారందరూ స్వయంగా కొవిడ్ పరీక్షలు చేయించుకోండి. చికిత్స తీసుకుంటునే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను’ అని శ‌ర‌ద్ పవార్‌ ట్వీట్ చేశారు.


2021 ఆగస్టులో శ‌ర‌ద్ పవార్‌ ఇంట్లో కొందరు కరోనా బారినపడ్డారు. ఆయ‌న నివాసంలోని న‌లుగురికి క‌రోనా సోకింది. శరద్ పవార్ ఇంట్లో ప‌ని చేసే వంట మ‌నిషి, ఇద్ద‌రు సెక్యూరిటీ సిబ్బంది, అలాగే మ‌రొక‌రికి క‌రోనా పాజిటివ్ నిర్థార‌ణ అయింది.

శ‌ర‌ద్ ప‌వార్‌కు అప్పుడు కోవిడ్-19 నెగిటివ్ వ‌చ్చింది. కానీ, ఈసారి ఆయనకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా సోకడంతో శరద్ పవార్ కొద్ది రోజుల వ‌ర‌కు కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. శరద్ పవార్ ఆరోగ్యానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీయడంపై శరద్ పవార్ స్పందించారు. తన ఆరోగ్యం పట్ల స్పందించిన మోదీకి శరద్ పవార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Read Also : Health Workers Fight : రూ.500 కోసం జుట్లు పీక్కున్న హెల్త్ వర్కర్లు.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు