President Droupadi Murmu: రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్షాల విమర్శలు.. మోదీ ఎన్నికల ప్రసంగంలా ఉదంటూ కామెంట్

ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా మంగళవారం పార్లమెంట్‌లో ప్రసంగించారు. అయితే, ఈ ప్రసంగంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు అధిర్ రంజన్ చౌధురి, శశి థరూర్ వంటి నేతలు విమర్శలు గుప్పించారు.

President Droupadi Murmu: బడ్జెట్ సెషన్ ప్రారంభం సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. రాష్ట్రపతి ప్రసంగంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించిన ప్రస్తావన లేదని విమర్శించాయి.

India U19 team: అండర్-19 టీ20 మహిళల ప్రపంచకప్ విజేతలకు సన్మానం.. ముఖ్య అతిథిగా ఎవరొస్తున్నారంటే

ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా మంగళవారం పార్లమెంట్‌లో ప్రసంగించారు. అయితే, ఈ ప్రసంగంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు అధిర్ రంజన్ చౌధురి, శశి థరూర్ వంటి నేతలు విమర్శలు గుప్పించారు. ‘‘రాష్ట్రపతి ప్రసంగంలో నిరుద్యోగం గురించిన ప్రస్తావన లేదు. ప్రజలకు మాత్రం ప్రభుత్వ వైఫల్యాలే కనిపిస్తున్నాయి. ఎప్పటిలాగే ప్రభుత్వ ప్రకటనల తరహాలోనే రాష్ట్రపతి ప్రసంగం సాగింది. అయినప్పటికీ, రాష్ట్రపతి ప్రసంగాన్ని మేం గౌరవిస్తాం’’ అని అధిర్ రంజన్ చౌధురి అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో అంశాలున్నాయని, వాటిని తమ సభ్యులు పార్లమెంట్‌లో లేవనెత్తుతారని ఆయన చెప్పారు.

Viral Video: కాయిన్స్ ఎగరేయడం నేర్చుకుంటున్న పిల్లి.. ఆకట్టుకుంటున్న వీడియో

సభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ పూర్తైందైని, ఇక తమ పార్టీ అభిప్రాయాలు వెల్లడిస్తుందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ కే.కేశవ రావు మాట్లాడుతూ ‘‘ఈ రోజు జరిగిన రాష్ట్రపతి ప్రసంగంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించిన ప్రస్తావన లేదు. రాష్ట్రపతికి ఒక సూచన చేస్తున్నాం. అదానీ యాక్ట్ తీసుకొచ్చేలా మోదీకి సూచించండని చెప్తున్నాం’’ అన్నారు. అయితే, బీఆర్ఎస్, ఆప్ నేతలు రాష్ట్రపతి ప్రసంగానికి హాజరుకాలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత శశి థరూర్ కూడా రాష్ట్రపతి ప్రసంగంపై విమర్శలు చేశారు.

మోదీ ఎన్నికల ప్రసంగంలా రాష్ట్రపతి ప్రసంగం సాగిందని విమర్శించారు. ‘‘రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయలేరు. కానీ, బీజేపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రపతితోనే ప్రచారం చేయిస్తున్నట్లుగా ఉంది. రాష్ట్రపతి ప్రసంగం మొత్తం ఎన్నికల సభలాగా, ప్రభుత్వాన్ని పొగిడేలాగే సాగింది’’ అని శశి థరూర్ అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు