Social Media
social media trolls : సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఏ చిన్నపని చేసినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాటిపై నెటిజన్లు కామెంట్లు చేస్తూ నవ్వులు పూయించటం కామన్ గా మారింది. తాజాగా ఈ జాబితాలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఎన్సీపీ ఎంపీ సుప్రియాసూలేలు చేరిపోయారు. ఇంకేముంది నెటిజన్లు సరదా కామెంట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
It was a great speech by Farooq Abdullah. Must listen for everyone. @ShashiTharoor pic.twitter.com/STQe0yulxG
— Farrago Abdullah Parody (@abdullah_0mar) April 6, 2022
లోక్ సభ సమావేశాల్లో రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై చర్చజరుగుతుంది. ఈ చర్చలో భాగంగా శశిథరూర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. అనంతరం జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతున్నారు. ఫరూక్ మాట్లాడుతుండగానే వెనుకాలే కూర్చొని ఉన్న సుప్రియా సూలే ఆమె వెనుకాల కూర్చొని ఉన్న శశిథరూర్ తో ముచ్చటిస్తూ కనిపించింది. సుప్రియాసూలే వెనక్కు తిరిగి ఏదో చెబుతుంటే శశిథరూర్ బల్లపై ముందుకువాలి నవ్వుతూ వింటున్నాడు. ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. దీంతో నెటిజర్లు తమ కామెంట్లతో, మీమ్స్ తో నవ్వులు పూయించే వ్యాఖ్యాలు, పాటలు జోడిస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు.
https://twitter.com/AMIT_GUNJANN/status/1511523004458872833