Dead Rat : బాబోయ్.. మటన్ కర్రీలో చచ్చిన ఎలుక..! ప్రముఖ రెస్టారెంట్లో కస్టమర్లకు ఊహించని షాక్
Dead Rat : కర్రీని ప్లేట్ లో వడ్డించుకుందామని చూశారు. అంతే, వారికి అక్కడ దిమ్మతిరిగిపోయే దృశ్యం కనిపించింది.
- Naveen
- Published on- July 3, 2023 / 10:59 PM IST
Dead Rat (Photo : Google)
Dead Rat In Dish : ఇప్పుడు ఎక్కడ చూసినా హోటళ్లు, రెస్టారెంట్లు బాగా పెరిగిపోయాయి. రోజుకో హోటల్, రెస్టారెంట్ పుట్టుకొస్తున్నాయి. వీటిలో తినే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. ఫ్యామిలీతో సరదాగా హోటల్ కో, రెస్టారెంట్ కో వెళ్లి ఫుడ్ ని టేస్ట్ చేయాలని అంతా ఆశపడతారు. అలాగే ఓ ఫ్యామిలీ ఓ ప్రముఖ రెస్టారెంట్ కు వెళ్లింది. అక్కడి ఫుడ్ ని టేస్ట్ చేయాలని అనుకుంది. కానీ, వారికి ఊహించని షాక్ తగిలింది. కర్రీలో చచ్చిన ఎలుక వచ్చింది.
ఈ షాకింగ్ ఘటన పంజాబ్ రాష్ట్రం లూథియానాలో జరిగింది. ఓ కుటుంబం విశ్వకర్మ చౌక్ దగ్గరలోని ప్రముఖ రెస్టారెంట్ కు వెళ్లింది. ఆ రెస్టారెంట్ మలాయ్ మటన్ కు చాలా ఫేమస్. దాంతో వారు కూడా మలాయ్ మటన్ కర్రీ ఆర్డర్ ఇచ్చారు. సిబ్బంది కర్రీ తీసుకొచ్చి వారి ముందు పెట్టారు. కోరిన కర్రీ వచ్చేసింది ఇక లాగించడమే తరువాయి అనుకున్నారు. కర్రీని ప్లేట్ లో వడ్డించుకుందామని చూశారు. అంతే, వారికి అక్కడ దిమ్మతిరిగిపోయే దృశ్యం కనిపించింది. కర్రీలో చచ్చిన ఎలుక ఉంది. దీంతో వారు షాక్ కి గురయ్యారు.
Also Read..Uttar Pradesh: గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన అబ్బాయిని కొట్టి చంపిన కుటుంబీకులు
కర్రీలో చచ్చిన ఎలుకను చూసి ఆ కుటుంబం బిత్తరపోయింది. వెంటనే దీనిపై రెస్టారెంట్ సిబ్బందిని నిలదీశారు. ఏంటీ దారుణం అని మండిపడ్డారు. ఆ ఎలుక చనిపోయి ఉందని, అది రోస్ట్ చేసి ఉందని బాధితులు చెప్పారు.
అయితే, రెస్టారెంట్ యాజమాన్యం మాత్రం మరోలా వాదిస్తోంది. రెస్టారెంట్ పరువు తీయడానికి కస్టమర్లే ఇలా చీప్ ట్రిక్ ప్లే చేశారని ఎదురుదాడికి దిగింది. ఇకపోతే, మటన్ కర్రీలో చచ్చిన ఎలుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమైనా హోటల్ కు కానీ రెస్టారెంట్ కు కానీ వెళ్లినప్పుడు వారు వడ్డించే ఆహారాన్ని ఓసారి చెక్ చేసుకుని తినడమే మంచిది అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
