Accident Pune
Accident : రోడ్డుపై వెళ్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ముందూ వెనుకా చూసుకోవాలి. అతివేగం ప్రమాదకరం. రాంగ్ రూట్ లో అస్సలు వెళ్లొద్దు. ఈ జాగ్రత్తలను పోలీసులు పదే పదే చెబుతున్నా లాభం లేకుండా పోతోంది. కొందరు వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి పడుతోంది.
అతివేగంగా వెళ్లడం, రాంగ్ రూట్ లో ప్రయాణించడం ప్రమాదం అని తెలిసినా కొందరు వాహనదారులు మానుకోవడం లేదు. ఫలితంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్ర పుణెలోని పింపరీ చించవాడలో దారుణం జరిగిపోయింది. వాహనదారుల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం బలైపోయింది.
కారు, బైక్ రాంగ్ రూట్ లో రావడమే ప్రమాదానికి కారణం. బైక్ నడిపే వ్యక్తి కారును దాటేందుకు యత్నించగా, అదే సమయంలో కారులోని వ్యక్తి డోర్ తెరిచాడు. అంతే, దారుణం జరిగిపోయింది. బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు దానికి తగిలి కిందపడ్డారు. అదే సమయంలో అటుగా లారీ వచ్చింది.
Old Age : వృద్ధుల్లో తిన్న ఆహారం ఎందుకు వంటపట్టదో తెలుసా?..
ఆ లారీ చక్రాలు తలపై నుంచి వెళ్లడంతో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో స్పాట్ లోనే చనిపోయాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. లారీ, కారు, బైక్ ఓనర్లపై కేసు నమోదైంది. కాగా, ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.
त्याने कारचा दरवाजा उघडला अन् याने हकनाक जीव गमावला; भीषण CCTV फुटेज; पुण्यातील घटना#accident #Pune #PuneNews #PimpriChinchwad pic.twitter.com/VMvUIoSaJe
— Lokmat (@lokmat) November 16, 2021