Old Age : వృద్ధుల్లో తిన్న ఆహారం ఎందుకు వంటపట్టదో తెలుసా?..

వయసులో తిన్నట్లుగా మెతుకులు మెతుకులుగా ఉన్న అన్నం తినడంమాని, పాలిష్‌ తక్కువగా పట్టిన పాతబియ్యం మెత్తగా వండుకొని తినండి.

Old Age : వృద్ధుల్లో తిన్న ఆహారం ఎందుకు వంటపట్టదో తెలుసా?..

Old Age

Old Age : వృద్దాప్యంలో అరవైయేండ్డు దాటిన తరువాత ఎంత బలమైన ఆహారం తీసుకున్నా అది వంట బట్టకుండా శరీరాన్ని బలహీనపరుస్తుంటుంది. అదే బలమైన ఆహారం బాల్య,యౌవనదశల్లో తీసుకుంటే శరీరానికి శక్తిని కలిగిస్తుంది. వృద్ధులకు అదే బలమైన ఆహారం ఎందుకు శక్తినివ్వడంలేదో వృద్దులంతా తెలుసుకొని సరైన ముందు జాగ్రత్తచర్యలు పాటించాలి.

అరవైఏళ్లు దాటినప్పటినుండి శరీరంలో వాతదోషం’ పెరిగిపోవడం ప్రారంభమౌతుంది. వృత్తి, ఉద్యోగం విరమణ పొంది ఖాళీగా ఉంటూ తిని కూర్చోవడమనే పొరపాటు కూడా వృద్దాప్య వయసుకు తోడై శరీరంలో దుష్టవాయువు అతిగా తయారుకావడానికి కారణమౌతుంది. ఇలా ‘పెఠిగిన అధిక దుష్ట్ర వాయువులు వృద్దుల శరీరంలో అనేక మార్పులకు కారణమౌతాయి.

వయసులో తిన్నట్లుగా మెతుకులు మెతుకులుగా ఉన్న అన్నం తినడంమాని, పాలిష్‌ తక్కువగా పట్టిన పాతబియ్యం మెత్తగా వండుకొని తినండి. వంట ఆముదంతో తిరగమాతవేసి వండిన ఆకుకూరలు,కాయగూరలు ఎక్కువగా సేవించండి. పెరుగును పూర్తిగా నిషేధించి ఎండాకాలంలో పలుచవి మజ్జిగను, వర్షాకాలంలో, చలికాలంలో మజ్జిగ చారును ఉపయోగించుకోండి. ఫ్రిజుల్లో ఉంచిన పదార్థాలు, అతిచల్లని నీళ్ళు, నిల్వ వున్న అన్నంకూరలు, మాంసాహారాలు, చేపలు, గుడ్డు, కొత్త బియ్యం, తెల్లబియ్యం పూర్తిగా నిషేధించండి.

కందికట్టు, బీర, పొట్ల, లేతవంకాయ, లేత మునక్కాయ, ఉల్లి, వెల్లుల్లి, కాయ్యతోటకూర, గలిజేరాకుకూర, లేత మునగొకుకూర, పాన్నగంటికూర, తీపిదానిమ్మ, మామిడి, రేగి, నిమ్ము నారింజ, ద్రాక్ష ఖర్జూర ఆహారంగా తీసుకోవాలి. దొరికితే దేశవాళి ఆవుపాలు, అవునెయ్యి లేదా దేశవాళి గేదెపాలు, పాతబెల్లం వాడుకోండి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో గోరువెచ్చని నువ్వులనూనె శరీరమంతా నిదానంగా మర్దన చేసుకొని ఒక గంటతరువాత స్నానంచేయండి. కరక్కాయబెరడు 100గ్రా, సాంఠి 100గ్రా, సైంధవలవణం 30గ్రా, తీసుకొని కొంచెం దోరగా వేయించి దంచి జల్లించి నిలవజేసుకొని ఉదయం, రాత్రి అరటీచెంచా మోతాదుగా గోరువెచ్చని నీటితో సేవిస్తుండండి.