Shocking Viral Video: రోడ్డుపై రెండు ఎద్దులు పోట్లాడుకుంటున్నాయి. దీంతో అటుగా వచ్చిన వాహనదారులు అవి ఎక్కడ మీద పడతాయోననే భయంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇదే సమయంలో ఓ యువతి స్కూటీపై అదే రోడ్డుపై వచ్చింది. రెండు ఎద్దులు పోట్లాడుకుంటుండడాన్ని గమనించిన యువతి.. స్కూటీని వెనక్కి తిప్పుకొని వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈలోపే అవి వేగంగా వచ్చి యువతి స్కూటీని ఢీకొట్టాయి. దీంతో స్కూటీతోపాటు ఆ యువతి కిందపడిపోయింది. ఆ వెంటనే ఎద్దులు అక్కడి నుంచి వెళ్లిపోవటంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: IAS Transfer: గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి.. ఆ వెంటనే ట్రాన్స్‌ఫర్ చేసిన ప్రభుత్వం.. అసలేం జరిగింది..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్ జిల్లా సమతానగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. iamankit._ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ప్రకారం.. రోడ్డుపై రెండు నల్లటి ఎద్దులు పోట్లాడుకుంటున్నాయి. వీటిని చూసి అటుగా వచ్చిన వాహనదారులు భయంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే, ఓ యువతి నీలిరంగు స్కూటీపై అటుగా వచ్చింది. రెండు ఎద్దులు పోట్లాడుకుంటూ వెళ్లి ఆమె స్కూటీని ఢీకొట్టాయి. అదృష్టవశాత్తూ ఆ యువతి ఎద్దుల తొక్కిసలాట నుంచి తృటిలో తప్పించుకుంది. స్కూటీని ఢీకొట్టిన తరువాత ఎద్దులు పోట్లాటను ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. దీంతో ఆ యువతి నెమ్మదిగా పైకిలేచి స్కూటీతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. పలువురు నెటిజన్లు.. ప్రభుత్వం స్పందించి రోడ్లపై ఎద్దులు సంచారం లేకుండా చూడాలని కోరారు. మరికొందరు నెటిజన్లు ఈ వీడియోను హాస్యాస్పదంగా అభివర్ణించారు.