CJP Protest : రాళ్లు విసిరినా సంయమనమే మార్గం.. యువతను శాంతింపజేయాలి : పోలీసులకు సుప్రీంకోర్టు కీలక సూచనలు

CJP Protest : కొందరు దారితప్పిన శక్తులు రాళ్లు విసిరినా కూడా యువకులను శాంతింపజేసి వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.

CJP Protest

  • విద్యార్థుల నిరసనలపై పోలీసుల చర్యలు
  • పోలీసులకు సుప్రీంకోర్టు కీలక సూచనలు
  • యువతకు కౌన్సిలింగ్ ఇవ్వాలి, శాంతింపజేయాలి

CJP Protest : నిరసనలు, ఆందోళనల సమయంలో భదత్రా బలగాలు, పోలీసులు సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హింసకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడాలి.. కానీ, యువతను శాంతింపజేసి, వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

జూలై 20న జరిగిన చలో పార్లమెంట్ ‘సంసద్ చలో’ మార్చ్ సందర్భంగా హింసకు ప్రేరేపించారనే ఆరోపణలపై అనేక మంది (CJP Protest) విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం పోలీసులకు ఈ సూచనలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా నిరసనల్లో పాల్గొనే యువత పట్ల ప్రభుత్వం, పోలీసులు ఆచితూచి వ్యవహరించాలని ధర్మాసనం పేర్కొంది.

‘కొంతమంది తప్పుదారి పట్టిన శక్తులు రాళ్లు విసిరినా యువతను శాంతింపజేసి వారితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. కౌన్సిలింగ్ ద్వారా పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలి. అధికారుల దూకుడు వైఖరి పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది’ అని సీజేఐ వ్యాఖ్యానించారు.

Read Also : RBI Repo Rate : లోన్ తీసుకున్నవారికి బిగ్ న్యూస్.. రెపో రేటుపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. EMI భారం పెరుగుతుందా? తగ్గుతుందా?

అయితే, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే పేరుతో హింసకు పాల్పడేవారిని అసలు వదలిపెట్టరాదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. పార్లమెంట్ వంటి అత్యంత భద్రతా ప్రాంతాల వద్ద జరిగే నిరసనల్లో బాధ్యతాయుతమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు.

శాంతియుత నిరసనలకు ప్రోత్సాహం ఇవ్వాలి :

దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. శాంతియుత నిరసనలకు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించింది. అదే సమయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఈ విషయాన్ని చట్టాన్ని అమలు చేసే సంస్థల విజ్ఞతకే వదిలేద్దామని పేర్కొంది. ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో మీకంట, మాకంటే వారికే బాగా తెలుసునని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.

పోలీసు, భద్రతా సిబ్బందిపై అవమానకరమైన భాషను వాడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులను గుర్తించి వారిచేత సామాజిక సేవ చేయించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు. ప్రజల మాట వినడం, వారితో చర్చించడం ద్వారా సమస్యలను పరిష్కరించడమే ఉత్తమ మార్గమని ధర్మాసనం స్పష్టం చేసింది.