Siddaramaiah Admitted To Manipal Hospital Due To Fever
Siddaramaia కాంగ్రెస్ సీనియర్ నేత, కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య జ్వరం కారణంగా బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్లర్లు చెప్పినట్టు ఆయన కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గత రాత్రి జ్వరం రావడంతో ఆయనకు కరోనా టెస్ట్ చేయగా..ఫలితం నెగిటివ్ గా నెగిటివ్ వచ్చినట్టు తెలిపింది.
అయితే డాక్టర్ల సూచనల మేరకు ఆయన మణిపాల్ ఆస్పత్రిలో పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారని.. రెండోసారి కరోనా టెస్ట్ చేసినా కూడా నెగిటివ్ వచ్చిందనీ..అయితే డాక్లర్ల సూచన మేరకు మరో రెండు రోజులు సిద్దరామయ్య హాస్పిటల్ లోనే ఉండనున్నారని ఆయన కార్యాలయం తెలిపింది. వైద్య నిపుణుల బృందం సిద్ధరామయ్యకు ట్రీట్మెంట్ అందిస్తోందని మణిపాల్ హాస్పిటల్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, గతేడాది ఆగస్టులో సిద్ధరామయ్య కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.