helmet పెట్టుకోనందుకు Sikh man కు రూ. 500 challaned

  • Publish Date - September 19, 2020 / 03:46 PM IST

not wearing helmet : హెల్మెట్ పెట్టుకోలేదని ఓ సిక్కు వ్యక్తికి రూ. 500 challaned కట్టాలంటూ ఫొటో పంపించారు. ఈ ఘటన యూపీ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇటీవలే ఆలీఘర్ లో కారు నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ధరించలేదని ఈ చలాన్ జారీ చేసిన కొద్ది రోజులకే మొరదాబాద్ లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.




ద్విచక్ర వాహనం నడుపుతున్న సమయంలో..హెల్మెట్ ధరించలేదని పేర్కొంటూ..సిక్కు వ్యక్తికి ఫైన్ తో కూడిన ఫొటో జారీ చేశారు అక్కడి ట్రాఫిక్ పోలీసులు. అయితే..ఇక్కడ…మోటార్ వాహన చట్టంలోని సెక్షన్ 129 ప్రకారం..తలపాగ ధరించిన (సిక్కులు) పురుషులు, మహిళలకు హెల్మెట్ ధరించడం నుంచి మినహాయింపు ఉంది.

హెల్మెట్ ధరించకుండా..ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ట్రాఫిక్ పోలీసులు రూ. 500 పైన్ కట్టాలని తనకు చలాన్ ఫొటో పంపించారని Kothiwal Nagar ప్రాంతంలో ఉంటున్న Sucha Singh వెల్లడించారు. అయితే..2010, ఆగస్టు 21వ తేదీన నిబంధన ఉల్లఘించినట్లు పేర్కొన్నారని తెలిపారు.




తాను తలపాగా ధరించి ఉన్నట్లు చలాన్ లో ఉన్న ఫొటో స్పష్టంగా చూపిస్తోందన్నారు. ఈ విషయంలో ట్రాఫిక్ పోలీసులను ఇంకా సంప్రదించలేదని, చలాన్ కు వ్యతిరేకంగా త్వరలోనే అప్లికేషన్ సమర్పించిబోతున్నట్లు తెలిపారు.


ట్రెండింగ్ వార్తలు