స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా(SIMI) పై మరో అయిదేళ్ల పాటు భారత ప్రభుత్వం నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా SIMI గత కొన్నాళ్లుగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నది. దీంతో కేంద్ర హోంశాఖ ఆ సంస్థను చట్టవ్యతిరేకమైనదని ప్రకటించింది. SIMI కార్యకర్తలు లౌకికవాదాన్ని దెబ్బతీస్తున్నారని, దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేంద్రం వెల్లడించింది.
SIMI పై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ట్రిబ్యునల్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. SIMI కి సంబంధం ఉన్న 58 కేసులను హోంశాఖ నమోదు చేసింది. జాతీయ భద్రతను భంగ పరుస్తూ SIMI కార్యకర్తలు ప్రజల మనస్సులను కలుషితం చేస్తున్నారని, దేశంలోని యథాతత్వానికి, భద్రతకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నరని కార్యకలాపాలను చేపట్టడం జరిగిందని దేశంలోని యథాతత్వానికి, భద్రతకు అవరోధంగా వ్యవహరిస్తున్న కార్యకలాపాలను చేపట్టడం జరిగిందని హోంశాఖ పేర్కొంది.