Uttar Pradesh
Pilibhit – Uttar Pradesh: చాలామంది తల్లిదండ్రులు పిల్లల ముందే పదే పదే గొడవ పడుతుంటారు. వారి గొడవను ఆపలేక, వద్దని చెప్పలేక పిల్లలు నరకం అనుభవిస్తుంటారు. పిల్లల చెవులు గిల్లుమనేలా ఇంట్లో తల్లిదండ్రులు గొడవ పడుతూ, వారి చదువుకు ఆటంకాలు తెస్తుంటారు.
తల్లిదండ్రులకు పిల్లలు ఏదైనా మంచి చెప్పినా వినిపించుకోరు. తల్లిదండ్రుల గొడవల ప్రతికూల ప్రభావం పిల్లలపై భవిష్యత్తులో పడుతుంది. ఇటువంటి గొడవల మధ్యే నలిగిపోయిన ఇద్దరు అమ్మాయిలు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలోని పురానాపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
ఆ ప్రాంత సర్కిల్ ఆఫీసర్ అలోక్ సింగ్ ఈ ఘటనపై వివరాలు తెలిపారు. స్థానిక కార్పొరేటర్ ఆసీజ్ రజా కూతుళ్లు కశిష్ (20), మున్నీ (18) ఆదివారం సాయంత్రం విషం తాగారు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి కశిష్, మున్నీ ప్రాణాలు కోల్పోయారు.
వారిద్దరి తల్లిదండ్రులు ఇంట్లో తరుచూ గొడవపడేవారని, ఆదివారం కూడా ఒకరిపై ఒకరు అరుచుకున్నారని పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆ అమ్మాయిల మృతదేహాలను ఆసుపత్రికి తరలించామని, తదుపరి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
Hyderabad: 3 నెలల క్రితమే ప్రేమ పెళ్లి.. 8 పేజీల లేఖ రాసి, రైలు కిందపడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య