Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో అక్రమాలు.. రంగంలోకి ప్రత్యేక దర్యాప్తు బృందం.. సీఎం యోగికి సిట్ ప్రాథమిక నివేదిక
అయోధ్య రామమందిరానికి(Ayodhya Ram Mandir) భక్తులు సమర్పించిన విరాళాల్లో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించింది.
- V Santhosh Kumar
- Published on- June 21, 2026 / 08:23 PM IST
SIT submits report to CM Yogi Adityanath regarding irregularities at the Ayodhya Ram Mandir
- రామమందిర విరాళాల లెక్కల్లో భారీ తేడాలు.
- సీఎం యోగికి సిట్ నివేదిక సమర్పణ.
- నిందితులను వదిలిపెట్టబోమన్న యూపీ సీఎం.
Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల్లో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించింది. ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపేందుకు ఈ నెల 13న లక్నో డీసీ విజయ్ విశ్వాస్ పంత్, ఐజీ రేంజ్ కిరణ్, ఫైనాన్స్ స్పెషల్ సెక్రెటరీ నీల్ రతన్‌లతో కూడిన ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ బృందం తన ప్రాథమిక నివేదికను ఆదివారం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సమర్పించింది. శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తున్న ఈ ఆలయానికి భక్తులు ఇచ్చిన బంగారం, వెండి, వజ్రాలు, రాళ్ళు వంటి విలువైన కానుకల డాక్యుమెంట్ల లెక్కల్లో సిట్ కీలకమైన తేడాలను గుర్తించింది.
OG Universe: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ మొదలయ్యింది.. షూటింగ్ ఎప్పటినుంచి అంటే?
ముఖ్యంగా గత ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగిన కుంభమేళా సమయంలో దాదాపు 10 లక్షల మంది భక్తులు రావడంతో ఆలయ హుండీలు, విరాళాల బాక్సులు గంటల వ్యవధిలోనే నిండిపోయాయి. ఆ సమయంలో వచ్చిన భారీ నగదు, ఆభరణాల నిర్వహణ, నిల్వ మరియు లెక్కల విషయంలో నిబంధనలు అస్సలు పాటించలేదని తేలింది. ఈ భారీ విరాళాలను దేవాలయ ట్రస్ట్ ఖాతాల్లో జమ చేయకుండా కొందరు అధికారులు దారి మళ్లించి, కాజేసినట్లు బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ అడిగిన ప్రశ్నలకు ఆలయ అధికారులు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు.
ఈ విచారణ నేపథ్యంలో ఆలయ సిబ్బంది, అధికారులు ఎవరూ అయోధ్య దాటి వెళ్లకూడదని సిట్ అధికారులు (Ayodhya Ram Mandir)ఆదేశాలు జారీ చేశారు. ఇందులో పాల్గొన్న అధికారులు, నిర్వాహకులు, సిబ్బంది పాత్రపై లోతైన దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కఠినంగా స్పందిస్తూ, పవిత్రమైన రామమందిర విరాళాల విషయంలో అవినీతికి పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
