Cute Video : ‘మోడీ సాబ్..హోంవర్క్ చేయలేకపోతున్నాం’: ప్రధానికి చిన్నారి ఫిర్యాదు

Six Year Old Kashmiri Girl Question For Pm Modi Saab For Homework Is The Cute Video

Six year old Kashmiri girl question for PM Modi : హోంవర్క్ చేయాలంటే పిల్లలు ఎంత రచ్చ చేస్తారో తెలిసిందే. రకరకాల కారణాలు చెప్పి హోంవర్క్ చేయటం తప్పించుకోవాలని చూస్తారు. కానీ ఓ ఆరు సంత్సరాల వయస్సున్న ఓ గడుగ్గాయి ‘‘హోం వర్క్ ఎక్కువైపోయింది మోడీ సాబ్’ అంటూ ఏకంగా ప్రధాని నరేంద్రమోడీకి ఫిర్యాదు చేసింది. కశ్మీర్‌కు చెందిన ఓ చిన్నారి హోం వర్క్ గురించి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే ఫిర్యాదు చేసింది. తన ముద్దు ముద్దు మాటలతో ‘మోదీ సాబ్ అంటూ ఆరేళ్ల చిన్నారి చేసిన ఫిర్యాదుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. చిన్న పిల్లలకు ఎక్కువ ఎక్కువ హోంవర్క్ ఇస్తున్నారనీ..ఇంత హోం వర్క్ అవసరమా అంటూ ఆ చిన్నారి ప్రధాని మోడీకి సూటి ప్రశ్న వేసింది. ముద్దు ముద్దు మాటలతో పేద్ద ఆరిందాలాగా ఈ చిన్నారి అడిగిన విధానం నెటిజెన్లను తెర మురిపించేస్తోంది.

ఈ వీడియోలో ఆచిన్నారి ‘నమస్కారం మోదీ సాబ్.. నేను అమ్మాయిని మాట్లాడుతున్నాను. నాకు ఆరేళ్ల వయసు. నేను మా జూమ్ క్లాస్ లు అటెండ్ అవుతున్నాను. ఆ జూమ్ క్లాసుల గురించే నేను మీకు కొన్ని విషాయలు చెప్పాలనుకుంటున్నాను. మేం చిన్న చిన్న పిల్లలం..మేడం, టీచర్లు, సార్లు ఎందుకు మాకు హోం వర్క్ ఇస్తున్నారు? ఇంత చిన్న పిల్లలు అంత పని ఏలా చేస్తారు? నేను లేవగానే ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు క్లాస్ జరుగుతుంది.

ఇంగ్లీషు, దాని తర్వాత గణితం, దాని తర్వాత ఉర్దూ, దాని తర్వాత ఈవీఎస్, దాని తర్వాత కంప్యూటర్. ఇంత పని చెప్తున్నారు చిన్న పిల్లలకు. 7, 8 చదువుతున్న వాళ్లకు ఎక్కువ హోం వర్క్ ఇవ్వాలి. ఇప్పుడు మేం ఏం చేయాలి’’ అంటూ పెదవి తిప్పుతూ భుజాలు ఎగరేస్తూ ముద్దు ముద్దుగా ప్రధానికి కంప్లైంట్ చేసిందా చిన్నారు. ఈ వీడియో చివర్లో ‘‘అస్సలావాలేకుం మోదీ సాబ్’’ అని ఎంతో మర్యాదగా..క్యూట్ గా ఎండ్ చేసింది.

కాగా ఈ చిన్నారి వీడియో ఫిర్యాదుపై జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ స్పందిస్తూ..స్కూల్ పిల్లలపై హోం వర్క్ భారం తగ్గిస్తూ..48 గంటల్లో పాలసీని రూపొందించాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసారు.చిన్నారి వీడియోను నెటిజెన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ‘‘ఎంత ముద్దుగా ఫిర్యాదు చేసిందో..’’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. కొందరైతే ‘‘అబ్బో నిజంగానే చాలా పెద్ద సమస్య’’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.