Marriage Bill
Marriage Bill : సభలో గందరగోళం మధ్య వివాహ వయస్సు సవరణ బిల్లును ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మహిళ శిశుసంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ బిల్లును లోక్‌సభ ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది మహిళల హక్కులను హరించడమేనని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. ప్రతిపక్షాల ఆరోపణలను బేఖాతరు చేస్తూ కేంద్రప్రభుత్వం తాము అనుకున్న విధంగా బిల్‌ను పాస్ చేసేందుకు సిద్ధమైంది. ఇక ఈ బిల్లుపై ప్రతిపక్షాలు సభలో మాటల యుద్దానికి దిగడంతో సభ రేపటికి వాయిదా వేశారు స్పీకర్.
చదవండి : Marriage Age : 18 ఏళ్లకే ఓటేస్తున్నారు..అదే వయస్సులో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు..?
లోక్ సభలో ఈ బిల్ అలవోకగా పాస్ అవుతుంది. సభలో అధికార పార్టీ సంఖ్యా బలం ఎక్కువగా ఉండటంతో బిల్లు పాస్ అవుతుందని ప్రభుత్వం ధీమాతో ఉంది. రాజ్యసభలో కూడా అధికార పార్టీకి మెజారిటీ ఉంది. ఇక మరికొన్ని పార్టీలు కూడా ఈ బిల్లుకు సహకరించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షాల వాదన ఇలా ఉంది.. ఇక 18 ఏళ్లకే ఓటు హక్కు ఉన్నప్పుడు.. 18 ఏళ్ల వయసులో భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ స్వాతంత్య్రం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ బిల్లు ద్వారా మహిళలు పరిపక్వతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ బిల్లు పై వివాదంతో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.
చదవండి : Women Marriage: అమ్మాయిల పెళ్లి వయసు 18 కాదు.. 21!