Viral video: రైలులో పాము.. వణికిపోయిన ప్రయాణికులు

ఆ పాముని ఏమీ అనవద్దని, దాన్ని కదిలివ్వవద్దని..

రైలులో పాము కనపడడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. జబల్‌పూర్-ముంబై గరీబ్రత్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రైలులోని పై బెర్త్‌లోని ఐరన్‌ గ్రిప్‌కు పాము చుట్టుకుని వేలాడుతున్నట్లు ఈ వీడియోలో కనపడుతోంది.

ఈ బెర్త్ అంతా సామానుతో నిండిపోయి ఉంది. ఆ బెర్త్‌కు దగ్గరగా ప్రయాణికులు ఎవరూ కూర్చోకపోవడం ప్రమాదం తప్పింది. ఆ పాముని ఏమీ అనవద్దని, దాన్ని కదిలివ్వవద్దని కొందరు ప్రయాణికులు మాట్లాడుకున్నారు. ఆ పాము రైలులోకి ఎలా వచ్చిందని కొందరు ప్రశ్నించారు. ఈ మాటలు అన్నీ వీడియోలో వినపడ్డాయి.

జబల్‌పూర్-ముంబై గరీబ్రత్ ఎక్స్‌ప్రెస్‌లో రైలు వచ్చిన ఘటనపై రైల్వే అధికారులు సెంట్రల్ రైల్వే సిబ్బందితో మాట్లాడుతున్నారని పశ్చిమ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హర్షిత్ శ్రీవాస్తవ తెలిపారు. వేలాది మంది ప్రయాణించే రైళ్లలోకి పాములు వస్తే ఎంతో ప్రమాదమని, ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాలని రైల్వే అధికారులను నెటిజన్లు కోరుతున్నారు.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి బిగ్ షాక్.. అక్రమ నిర్మాణాలు కూల్చివేత