Snake Bite Disaster: పాము కాటుకు గురై ఆ రాష్ట్రంలో ఏటా 900 మంది మృతి: ప్రత్యేక విపత్తుగా ప్రకటన

పాము కాటు కారణంగా ఒడిశా రాష్ట్రంలో ప్రతి ఏటా సరాసరి 900 మంది మృతి చెందుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి

Snkae

Snake Bite Disaster: పాముల నుంచి మనుషులకు నేతటి ముప్పు ఉందొ ఈ కథనం తెలుపుతుంది. ప్రకృతి వైపరీత్యాల కంటే పాము కాటు కారణంగానే ఎక్కువమంది మనుషులు మృతి చెందుతున్నారు. ఇది ఎంతలా ఉందంటే..ఏకంగా ఒక రాష్ట్రం ప్రత్యేక విపత్తుగా ప్రకటించిందంటే పాము కాటు ప్రమాద తీవ్రత ఎంతలా ఉందొ అర్ధం చేసుకోవాలి. పాము కాటు కారణంగా ఒడిశా రాష్ట్రంలో ప్రతి ఏటా సరాసరి 900 మంది మృతి చెందుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు, ఇతర విపత్తుల కారణంగా సంభవించే మృతుల కంటే ఈ సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. పాము కాటు మరణాలను సీరియస్ గా తీసుకున్న ఒడిశా ప్రభుత్వం 2015 ఏప్రిల్ 1 నుంచి పాము కాటు మరణాలను ‘రాష్ట్రంలో ప్రత్యేక విపత్తుగా (స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్’)గా ప్రకటించింది. పాముకాటు మరణాన్ని రాష్ట్ర-నిర్దిష్ట విపత్తుగా ప్రకటించిన దేశంలోనే మొదటి రాష్ట్రం ఒడిశా కావడం ఇక్కడ గమనార్హం.

Also read:UP : యూపీలో మత కార్యక్రమాలకు ‘అఫిడవిట్’ తప్పనిసరి చేసిన యోగి ప్రభుత్వం

ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 900 మంది పాము కాటుతో ప్రాణాలు కోల్పోతున్నారని ప్రత్యేక సహాయ కమిషనర్ కార్యాలయ అధికారులు మంగళవారం తెలిపారు. 30 జిల్లాల్లోని జిల్లా కలెక్టర్ల నుండి అందిన నివేదికల ప్రకారం, రాష్ట్రంలో 2015 నుండి 2021 వరకు గత 7 సంవత్సరాలలో 5,964 పాముకాటు మరణాలు సంభవించాయి, సగటు వార్షిక మరణాల సంఖ్య 852గా ఉంది. రాష్ట్రంలో ఇతర విపత్తు-సంబంధిత మానవ మరణాల కంటే పాముకాటు మరణాల సంఖ్య యాదృచ్ఛికంగా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పాము కాటు మరణాల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు..వైద్య చికిత్స వేగంగా అందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు విపత్తు సహాయ శాఖ వెల్లడించింది.

Also Read:Road Accident : యూపీలో బస్సు బోలెరో ఢీ.. ఆరుగురు మృతి..మరో 10మంది పరిస్థితి విషమం