భారీ హిమపాతం,విరిగిన కొండచరియలు..జమ్మూ-శ్రీనగర్ హైవే మూసివేత

జమ్ము-శ్రీనగర్​ జాతీయ రహదారిపై మంగళవారం(మార్చి-23,2021) రాకపోకలు నిలిచిపోయాయి. కాశ్మీర్‌కు ప్రవేశ ద్వారం "జవహర్ టన్నెల్ ఏరియా"లో భారీ హిమపాతం మరియు బనిహాల్, ఛందేర్​కోటె ప్రాంతాల మధ్యలో కొండ చరియలు విరిగిపడిన కారణంగా మంగళవారం జమ్ము-శ్రీనగర్​ జాతీయ రహదారిని మూసివేసినట్లు అధికారులు తెలిపారు

Snowfall, landslides జమ్ము-శ్రీనగర్​ జాతీయ రహదారిపై మంగళవారం(మార్చి-23,2021) రాకపోకలు నిలిచిపోయాయి. కాశ్మీర్‌కు ప్రవేశ ద్వారం “జవహర్ టన్నెల్ ఏరియా”లో భారీ హిమపాతం మరియు బనిహాల్, ఛందేర్​కోటె ప్రాంతాల మధ్యలో కొండ చరియలు విరిగిపడిన కారణంగా మంగళవారం జమ్ము-శ్రీనగర్​ జాతీయ రహదారిని మూసివేసినట్లు అధికారులు తెలిపారు.

ఫలితంగా హైవేకి రెండు వైపులా 300కి పైగా వాహనాలు రహదారులపైనే నిలిచిపోయాయి. చాలా ప్రాంతాల్లో వర్షాలు కూడా కురిసాయని అధికారులు స్పష్టం చేశారు. సోమవారం రాత్రి నుంచే వందల సంఖ్యలో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయని, సహాయక చర్యలు చేపట్టి రంబన్​ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించినట్లు ట్రాఫిక్ డీఎస్పీ పరూల్ భరద్వాజ్ పేర్కొన్నారు.

జమ్ములోని రంబన్, దోడ, కిస్తవార్ ప్రాంతాల్లో మంచు భారీగా కురుస్తుందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. జమ్ములో మంగళవారం 14.9 డిగ్రీ సెల్సియస్​ల ఉష్ణోగ్రత నమోదైందని స్పష్టం చేశారు. సోమవారం ఉష్ణోగ్రత 16.2 డిగ్రీలుగా ఉందని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు