Tulasi benifits : ఆరోగ్యాల సిరి..తుల‌సి..గొంతునొప్పి..నోటి శుద్ధి కోసం

ఆరోగ్యాల సిరి తులసి. తులసి ఆకులు, విత్తనాలు వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసుకుంటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.

Tulasi benifits : తులసి. ఆరోగ్యాలను ఇచ్చే సిరి. ఇంట్లో తులసి మొక్క ఉంటే ఎంత శుభకరమో..ఇంటి ఆరోగ్యానికి అంతే మంచి చేస్తుంది తులసి. తులసిలో ఉండే ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. తులసి ఆకులు నుంచి వేర్ల వరకూ అంతెందుకు? తులసి మొక్క నుంచి వీచే గాలి కూడా ఆరోగ్యాన్నిస్తుంది అంటే తులసి మొక్క గొప్పతనం గురించి వేరే చెప్పాలా? తులసి ఆకులతో ఎన్నో ఔషధాలు తయారుచేస్తారు. మన పురాణాల్లో తులసికి చాలా ప్రాధాన్యత ఉంది.తులసి పవిత్రమొక్కగా పూజలందుకుంటోంది. తులసి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే శుభాలనిచ్చే తల్లి..ఆరోగ్యాలను ఇచ్చే కల్పతరువు.

చాలామందికి నోటి దుర్వాసన స‌మ‌స్య ఉంటుంది. ఇది నలుగురిలోకి వెళ్లటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ స‌మ‌స్య ఉన్న‌వాళ్లు ప్ర‌తిరోజూ రాత్రి నీళ్ల‌లో తుల‌సి ఆకుల‌ను నాన‌బెట్టి..ఆ నీటిని మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ఆ నీటితో ప‌ళ్లు తోముకుంటే నోటి దుర్వాసన పోతుంది. అంతేకాదు తులసి ఆకులు నమిలినా ఈ సమస్య పోతుంది. అంతేకాదు నోట్లో పొక్కులు కూడా త్వరగా మానిపోతాయి.గొంతు నొప్పి కూడా చాలా మందిలో భ‌రించ‌రాని స‌మ‌స్య‌గా ఉంటుంది. ఏది మింగినా గొంతునొప్పి.ఆఖరికి మంచినీళ్లను మింగాల‌న్నా గొంతు నొప్పి వేధిస్తుంది. ఈ స‌మ‌స్య ఉన్న‌వాళ్లు నీళ్ల‌లో తుల‌సి ఆకులు వేసి బాగా మ‌రిగించి ఆ నీళ్లు గోరువెచ్చ‌గా తాగాలి. గొంతునొప్పి మ‌టుమాయమే ఇక.

ఇంకా తుల‌సి ర‌సంలో తేనె క‌లిపి తీసుకున్నా మంచిదే. తులసిలో ఉండే ఔషధాలు, తేనెలో ఉండే గుణాలు రెండూ యాంటీ సెప్టిక్ గుణాలు కావటం వల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు ద‌రిచేర‌వు. సాధార‌ణ జ‌లుబు, ద‌గ్గు కూడా త‌గ్గుతాయి. నోటిపూత‌కు కూడా ఇది మంచి ఔష‌ధంగా ప‌నిచేస్తుంది.తుల‌సి ఆకులకు శ‌రీరంలో కొవ్వును త‌గ్గించే గుణం కూడా ఉంటుంది. తుల‌సి ఆకుల‌ను ప్ర‌తిరోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా మజ్జిగ‌తో క‌లిపి తీసుకుంటే బ‌రువు అదుపులో ఉంటుంది. ఇక నిద్ర‌లేమితో బాధ‌పడేవారు తుల‌సి ఆకుల‌ను చ‌క్కెర‌తో క‌లిపి తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

అంతేకాదు 12 అయితే తుల‌సి ఆకుకు ఎన్నో ర‌కాల వ్యాధులతో పోరాడే అద్భుత‌మైన‌ శ‌క్తి ఉంది. తులసి ఆకు ఆరోగ్యంతోపాటు.. చర్మ సంరక్షణకి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. దివ్య ఔషధంలా పనిచేస్తుంది కాబట్టే పెద్దలు తులసిని సర్వరోగ నివారిణి అంటారు ఆయుర్వేద నిపుణులు. తులసి ఆకుల్ని నీడలో ఆరబెట్టిపొడి చేసి తేనెతోగానీ, పెరుగుతోగానీ కలిపి తీసుకుంటే.. అనేక రోగాలను నివారించవచ్చు. ఉదయాన్నే పరగడపున తులసి రసాన్ని తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమైపోతుంది. జీర్ణ సమస్యలు అనేవే రావు.

తులసి రసం.. అల్లం రసం కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయని డాక్ట్లు చెబుతుంటారు. ప్రతిరోజూ 5 నుంచి 25 గ్రాముల నల్ల తులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే.. సుదీర్ఘ సమస్యగా ఉండే ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చట.

చాలామందిని తరచూ వేధించే సమస్య గ్యాస్ర్టిక్ ట్రబుల్. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవటం వల్లా..లేదా జంక్ ఫుడ్స్ తిన్నా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. దీనికి తులసి మంచి పరిష్కారమనే చెప్పాలి. నల్ల తులసి రసాన్ని మిరియాల పొడిలో వేసి ఆ మిశ్రమాన్నినూనె లేదా నెయ్యితో కలిపి తీసుకుంటే గ్యాస్ర్టిక్ సమస్యల భలే బయటపడిపోవచ్చు. ఇలా ఆరోగ్యాల సిరి తులసి వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.

ట్రెండింగ్ వార్తలు