Solar Eclipse 2025 : మరి కొన్ని రోజుల్లో సూర్యగ్రహణం రాబోతోంది. అటు సైన్స్ పరంగా, ఇటు జ్యోతిష్యంలో సూర్య గ్రహణానికి ప్రాముఖ్యత ఉంది. మరి సూర్యగ్రహణం ఎప్పుడు? ఎన్ని గంటలకి? మనకి ప్రభావం ఉందా? ఆరోజున ఏం చేయాలి? ఏం చేయొద్దు? ఇలాంటి సందేహాలు అందరిలోనూ ఉంటాయి.
చంద్రుడు.. భూమికి సూర్యుడికి మధ్య వెళ్లినప్పుడు ఆ పరిస్థితుల్లో సూర్యకాంతి భూమిని చేరుకోలేకపోతుంది. దీన్నే సూర్యగ్రహణం అంటారు. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మార్చి 29న ఏర్పడనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాదు. ఈ ఖగోళ దృశ్యాన్ని చూసేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. మరి సూర్యగ్రహణం మన దేశంలో కనిపిస్తుందా? లేదా?
ఈ సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం మార్చి 29న ఏర్పడబోతుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం కాబట్టి మన దేశ ప్రజలు చూడలేరు. మనకు సూర్యకాంతి సాధారణంగానే పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read : పిల్లల ఆరోగ్యమే ముఖ్యం.. ఎనర్జీ డ్రింక్స్ బ్యాన్ చేయాల్సిందే.. ఇక స్కూల్ క్యాంటీన్లలో నాట్ అలోడ్..!
భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు గ్రహణం ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటల 17 నిమిషాలకు పతాక స్థాయికి చేరుకుంటుంది. సాయంత్రం 6 గంటల 13 నిమిషాలకు ముగుస్తుంది. దాదాపు 4 గంటల పాటు గ్రహణం ఉంటుంది.
నాసా ప్రకారం.. ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు. ఆర్కిటిక్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, యూరప్, ఆసియాలోని కొన్ని దేశాల్లో మాత్రం సూర్యగ్రహణం కనిపిస్తుంది.
గ్రహణం సమయంలో చేయకూడనివి..
భోజనం చేయకూడదు.
శుభకార్యాలు తలపెట్టకూడదు.
ప్రయాణాలు చేయకూడదు.
ఆలయాలకు వెళ్ళకూడదు.
గ్రహణం వీడాక చేయాల్సినవి..
తల స్నానం చేయాలి.
ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
దైవ ప్రార్థన చేయాలి.
దాన ధర్మాలు వంటివి చేయాలి.
కంటితో సురక్షితంగా గమనించగలిగే చంద్రగ్రహణంలా కాకుండా, సూర్యగ్రహణాన్ని నేరుగా చూడకూడదు. అలా చూస్తే రెటీనా దెబ్బతిని కంటి చూపు పోయే ప్రమాదం ఉంది. సూర్యగ్రహణాన్ని చూసేటప్పుడు తగిన కంటి రక్షణను ధరించడం మంచిది. స్మోక్డ్ గ్లాస్ లేదా సాధారణ సన్ గ్లాసెస్ వంటి ఇంట్లో తయారు చేసినవి కూడా సరిపోతాయి. 2025లో రెండు సూర్యగ్రహణాలు సంభవిస్తాయని నాసా అంచనా వేసింది. మొదటిది మార్చి 29 న ఏర్పడనుంది. రెండోది సెప్టెంబర్ 21న సంభవించే అవకాశం ఉందంది.