Sonia Gandhi on 'Bharat Jodo Yatra'
Sonia Gandhi to travel abroad: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన కుమారుడు, కూతురు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో కలిసి విదేశాలకు వెళ్ళనున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆమె విదేశాలకు వెళ్తున్నట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ చెప్పారు. అయితే, ఢిల్లీలో ‘మెహంగై పర్ హల్లా బోల్’ ర్యాలీ నిర్వహించేలోగా రాహుల్ గాంధీ తిరిగి వస్తారని, సెప్టెంబరు 4న ప్రసంగిస్తారని ఆయన వివరించారు. సోనియా గాంధీ తిరిగి ఢిల్లీకి చేరుకునే ముందు ఆమె తల్లి వద్దకు కూడా వెళ్తారని చెప్పారు.
సోనియా గాంధీ తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. సోనియా గాంధీ ఏ రోజున విదేశాలకు వెళ్తారన్న విషయాన్ని ఆయన పేర్కొనలేదు. కాగా, సోనియా గాంధీకి పలుసార్లు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీలో ఆమె చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఆమె గతంలో పలుసార్లు విదేశాల్లో చికిత్స తీసుకున్నారు. మరోవైపు, నిన్న సోనియా గాంధీ భారత కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్ లో కలిశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. కాంగ్రెస్ నాయకత్వ మార్పుపై కూడా అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
Retail Price Of Rice Rises: ఇప్పటికే గోధుమ ధరల పెరుగుదల.. ఇప్పుడు బియ్యం ధరలూ ఆ బాటలోనే..