Sonu Sood vs Ganjam Collector : కరోనా బాధితుడి బెడ్ ఏర్పాటుపై సోనూ సూద్ క్లారిటీ

కరోనా రోగులకు సాయమందించే విషయంలో ఒడిషా ప్రభుత్వం.. రియల్‌ హీరో సోనూసూద్‌ల మధ్య చోటు చేసుకున్న కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వైరల్‌గా మారింది. తనను సంప్రదించిన ఓ వ్యక్తికి సకాలంలో సాయం అందించినట్టు సోనూ సూద్‌ ప్రకటించగా..

Bed For Covid Patient Ganjam Collector, Sonu Sood Exchange Claims On Twitter

Sonu Sood bed for COVID patient : కరోనా రోగులకు సాయమందించే విషయంలో ఒడిషా ప్రభుత్వం.. రియల్‌ హీరో సోనూసూద్‌ల మధ్య చోటు చేసుకున్న కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వైరల్‌గా మారింది. తనను సంప్రదించిన ఓ వ్యక్తికి సకాలంలో సాయం అందించినట్టు సోనూ సూద్‌ ప్రకటించగా.. అలాంటి పరిస్థితి ఏదీ లేదని, సదరు వ్యక్తికి ఎలాంటి సాయం అందలేదంటూ ప్రభుత్వ అధికారులు స్పందించడంతో వివాదం చెలరేగింది. ఒడిషాకు చెందిన ప్రదీప్‌ బెహరా అనే వ్యక్తి ట్విట్టర్‌ ద్వారా సోనూసూద్ సాయం కోరాడు.

కోవిడ్‌తో తన భార్య ఆరోగ్యం విషమించిందని.. బరంపూర్‌, భువనేశ్వర్‌లలో ఎంతగా ప్రయత్నించినా ఆస్పత్రిలో బెడ్‌ దొరకలేదని.. తన భార్య ప్రాణాలు కాపాడాలంటూ సోనూని మే 14న మధ్యాహ్నం ట్విట్టర్‌ ద్వారా సాయం కోరాడు. అతని రిక్వెస్ట్‌పై స్పందించిన సోనూసూద్‌.. ఆందోళన చెందవద్దని.. బరంపూర్‌లో ఉన్న గంజాం సిటీ ఆస్పత్రిలో బెడ్‌ ఏర్పాటు చేసినట్టు ట్వీట్‌ చేశాడు. సోనూసూద్‌ ట్వీట్‌పై గంజాం జిల్లా కలెక్టర్‌ స్పందించారు.

గంజాం సిటీ ఆస్పత్రిలో బెడ్‌ కావాలంటూ సోనూ సూద్‌ నుంచి కానీ, సోనూసూద్‌ ఫౌండేషన్‌ నుంచి కానీ తమకు ఎటువంటి అభ్యర్థన రాలేదన్నారు. సోనూసూద్‌ని బెడ్‌ కోసం రిక్వెస్ట్ చేసిన వ్యక్తి హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు ప్రకటించారు. బరంపూర్‌ జిల్లాలో బెడ్‌ ఇష్యూలు లేవని.. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. కలెక్టర్‌ ట్వీట్‌పై సోను స్పందించారు.


బెడ్‌ ఏర్పాటు చేశామని చెప్పాను తప్పితే మీతో మాట్లాడి బెడ్‌ అరేంజ్‌ చేసినట్టు నేను ఎప్పుడు చెప్పలేదంటూ బదులిచ్చారు. పేషెంట్‌కి బెడ్‌ అందిందని.. ఆమె భర్తతో తాను చేసిన చాటింగ్‌ వివరాల స్క్రీన్‌ షాట్‌లను కలెక్టర్‌కి ట్యాగ్‌ చేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు సోనూసూద్. కావాలంటే మరోసారి చెక్‌ చేసుకోండి అంటూ సూచించాడు. కోవిడ్‌ సమయంలో మీరెంతో కష్టపడుతున్నారని కలెక్టర్‌ని మెచ్చుకున్నాడీ రియల్‌ హీరో.